మళ్ళీ తోడేళ్ల వేట!?

`తెలంగాణలో ఐక్య ప్రకంపలు

`ఆంద్రప్రదేశ్‌లో లోకేష్‌ 

`మొత్తం మీద రామోజీ రావు వద్ద దౌత్యం…

`మళ్ళీ తెలుగుదేశంతో తెలుగు ప్రజల నినాదం…

`మునుగోడు సాక్షిగా తెలంగాణను ముంచే ప్రయోగం!

`తెరవెనుక చంద్రబాబు కుటిల మంత్రాంగం…

`కొందరు తెలంగాణ నేతల కనుసన్నలో సాగుతున్న చీకటి పథకం!

`అన్ని పార్టీలను ముంచి, తెలుగు రాగంలో వంచనకు తెరతీసి…

`పైకి కనిపించేంత చిన్న రాజకీయాలు కాదు…

`తెలంగాణను వదిలేయడం వాళ్ల వళ్ల కావడం లేదు!

`తెలంగాణ బాగుపడడం అసలే నచ్చడం లేదు!

`ఎలాగైనా బిజేపితో కలిస్తేనే తెలంగాణ మళ్ళీ కలుపుకోవచ్చు?

`పెత్తనం చేయొచ్చు! అణచివేయొచ్చు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కనుసన్నల్లో రాజకీయాలు నడిచింత కాలం…తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో వున్నంత కాలం…ఆపార్టీ బలంగా వున్నంత కాలం ఏమీ లేయలేం…మన పప్పులు ఉడికించలేం. మన ఆటలు చెల్లవు. కోరికలు నెరవేరవు…కలలు తీరవు. అధికారం అన్న మాట మన కల్ల…కనీసం దాని దరిదాపుల్లోకి కూడ వెళ్లలేం…ప్రభావం చూపలేం…మనం గెలిచినా తెలంగాణ నాయకత్వం ముందు మోకరిళ్లకుండా బతకలేం…వారి కనుసన్నల్లో బతక్కుండా వుండేలేం…పెత్తనానికి తావులేని చేట చోతలు కట్టుకొని బతకడం కష్టం…ఇప్పటికే ఎనమిదేళ్లయింది…ఇంకా ఎనభై ఏళ్లయినా మనం అనుకున్నది చేయలేం…మళ్లీ తెలంగాణను వశం చేసుకోలేం…తెలంగాణ లేకుండా ఎక్కువ కాలం వుండలేం…గత డెబ్బై ఏళ్లనుంచి సీమాంధ్ర నాయకులది ఇదే తంతు…మద్రాసు నుంచి విడిపోయిన నాడు అందుకున్న పాట…తెలుగు రాగం…ఐక్య మోసం…చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరడం…విష పెత్తనం చెలాయించడం…తెలంగాణను దోచుకోవడం…నాశనం చేయడం సీమాంధ్ర నాయకులకు తెలిసింది…దోచుకు తినడం అలవాటైన వాడు ఆగలేడు…తెలంగాణ లేకుండా రాజకీయం నెరపలేడు….ఎంతో చైతన్యవంతమైన తెలంగాణలో 1948లోనే నైజాంను తరిమినా, కలిసుంటే కలదు సుఖం…అంటూ తెలుగు పిడి వాదం తెచ్చి, ఆంధ్ర అనే పదం చేర్చి తెలంగాణ అస్ధిత్వాన్ని మళ్లీ చెల్లా చెదురు చేశారు…తెలంగాణను చెరపట్టించారు…వేధించారు…వెక్కిరించారు…గోస పెట్టారు…పలుచన చేశారు…చులకన చేశారు…ఇదంతా తెలంగాణ ప్రజలు మర్చిపోరు…కాని తెలంగాణ వాదుల ముసుగులో ఉద్యమం చేసినట్లు భవిష్యత్‌ రాజకీయం కోసం పైలా పచ్చీసు ఆడినవారితోనే ఇప్పుడు మళ్లీ తంట…బానిక బతుకులకు అలవాటు పడిన నేతలనే, గోతి కాడ నక్కలతోనే అసలు తంటా…సీమాంధ్ర నేతలతో వారు కలిసి ఆడుతున్న తొండాట…పూర్వపు రోజులకు మళ్లీ వేయనున్న ముళ్ల బాట…సీమాంధ్ర నేతలు వచ్చి తెలంగాణలో రాజకీయం చేయడమే ఒక విషరాజకీయ క్రీడ. ఇంకా వేచి చూస్తే ఏం చేయలేదు..ఎక్కడా ఎదగలేం…తెలంగాణలో కనీసం ముప్పై నుంచి నలభై స్ధానాల్లో ప్రభావం చూపే స్ధితిలో వున్నాం…తెలంగాణ బాగుపడుతుంటే తట్టుకోలేం…అక్కడి సంపదమీద కన్ను వదులుకోలేం…ఇది ఆంధ్రా నాయకుల గోతికాడ నక్క వేషాలు…ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగుకు చేరుకుంటుంటే తెలంగాణ బాగుపడుతోంది.

అభివృద్ధిలో దూసుకుపోతోంది…ప్రగతిలో పరుగులు పెడుతోంది. పేదరికం లేని సమాజ నిర్మాణం జరుగుతోంది. విద్య, వైద్య రంగాల్లో పురోగమిస్తోంది. ఐటిలో దేశంలోనే మేటిగా రాకెట్‌ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. కాని ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు కోట్లున్న భూముల ధరలు నాలుగు లక్షలకు పడిపోయాయి…ఉన్న రాజధాని పనికి రాకుండాపోతోంది…అభివృద్ధి కుంటుపడిరది. ఒకప్పుడు కర్నూలు రాజధానిగా డేరాలు వేసుకున్న కాలం కంటే అద్వాహ్నంగా తయారౌతోంది….ఇప్పుడు మళ్లీ ఒక్క ఆంధ్రతో అరవైఏళ్ల కాలానికి వెళ్లిపోయాం…? అరవైఏళ్ల పాటు ఎంత తొక్కేసినా, తెలంగాణ వచ్చిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సమర్ధవంతమైన నాయకత్వంలో తెలంగాణ మురిసింది…ఎనమిదేళ్లలో ఎక్కడికో వెళ్లిపోయింది….ఉమ్మడి రాష్ట్రంలో ఊహించలేని పనులన్నీ పూర్తి చేసుకుంటూ నెంబర్‌ వన్‌ రాష్ట్రమౌతోంది…ఎండబెట్టిన తెలంగాణలో ఏరుల్లో నీటి పరవళ్లు వయ్యారాలు పోతున్నాయి….పండబెట్టిన తెలంగాణను పచ్చగ చేసుకున్నారు…ప్రాజెక్టులు కట్టుకున్నారు..రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. కాలువలు తవ్వుకున్నారు…కాళేశ్వరం కట్టుకున్నారు. తెలంగాణలో ఏదైతే సాద్యం కాదని అవరవైఏళ్లపాటు మోసం చేశారో…ఆ తెలంగాణ మొత్తం ప్రాజెక్టులతో కళకళలాడేలా చేసుకున్నరు…సిరుల తెలంగాణ చేసుకున్నరు…! కాని విడిపోయి పోలవరం కట్టుకోలేకపోతున్నమని సీమాంధ్ర నేతులు కుమిలిపోతున్నారు…పచ్చగా వున్న కాడ తినడం…ఎచ్చగా ఉన్న కాడం పండుకోవడం అలవాటైన సీమాంధ్ర నాయకత్వం భరించలేకపోతోంది…తెలంగాణ ప్రగతిని ఓర్వలేకపోతోంది…! అరవై ఏళ్లు చీకట్లు చేసినా, తెలంగాణ తెచ్చుకొని మూడు నెలల్లో వెలుగులు నింపుకున్నరు..మూడేళ్లలో రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచితం కరంటు ఇచ్చుకుంటున్నరు…! కాని సీమాంధ్రలో కోతలు చూస్తున్నారు..ఉడకపోతలో బతుకులు వెల్లదీస్తున్నరు…కళ్లలో మంటలు నింపుకుంటున్నరు…తెలంగాణను చూసి నిప్పులు పోసుకుంటున్నారు…అందుకే మళ్లీ తెలంగాణ మీద పెత్తనం కోసం పాకులాడుతున్నారు…

తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణలోనే మళ్లీ ముసలం పుట్టిస్తామని ఎనమిదేళ్ల కిందనే నాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఒకనాడు విడిపోయిన తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలే కలుస్తన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు..రెండు దేశాల మధ్య వున్న బెర్లిన్‌ గోడలను ప్రజలే బద్దలు కొడుతున్నారంటూ రాళ్లు తెచ్చి చూపించారు…ఆనాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోనే హడావుడి చేశారు…ఏనాటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లు కలుస్తాయంటూ చెప్పుకున్నారు. కుటిలత్వం నిండిన నాయకులు ఖాళీగా వుంటే కుత్సిత బుద్ధిని ఎలా ప్రదర్శించాలో ఆలోచిస్తుంటారు….కొట్లాడే తత్వం లేకపోయినా, మోసాన్ని నమ్ముకుంటారు..! ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన మూడేళ్లకే తెలంగాణను అస్ధిర పర్చాలని చూశాడు…పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో తెలంగాణ ప్రభుత్వాన్ని పడదోయాలని చూశాడు..ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాంతో తెలంగాణనుంచి చంద్రబాబు పారిపోయాడు…కాని తెలంగాణ మీద ఆశ చావలేదు…తెలంగాణ మీద ఆధిపత్యం మీద మోజు తీరలేదు…ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను ఎదుర్కొలేక, తెలంగాణలోనైనా చోటు కోసం నయవంచనను తెర తీస్తున్నాడు…అందుకు మళ్లీ పాతరాగం అందుకుంటున్నాడు…. తెలంగాణలో రాజకీయంగా అసంతృప్తి వాదులతో కొత్త రాజకీయం మొదలు పెట్టాడు…అటు రేవంత్‌ రెడ్డితో కాంగ్రెస్‌లో రాజకీయం మొదలుపెట్టి, ఇటు బిజేపితో కలిసి ఏక కాలంలో రెండు మూతుల పాము రాజకీయం నెరపాలనుకుంటున్నాడు…బిజేపితో కలిసి తెలంగాణ రాజకీయాలను అస్ధిరం చేయాలనుకుంటున్నాడు..అందుకు షర్మిల అడుగులతో ప్రయోగం చేశారు…ప్రజలు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగ మారుతున్నారన్న భ్రమల్లో కళ్లు మూసుకొని పిల్లి పాలుతాగినట్లు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు….సీమాంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే బతకలేదన్నారు…

నిజానికి తెలంగాణ లేకపోతే తాము బతకలేమని తెలుసుకున్నారు…భుజ్జగింపులు చేయాల్సిన సమయంలో గద్దింపులు మొదలుపెట్టారు…ఒత్తిడి రాజకీయాలే తెలంగాణ మీద ఎల్ల కాలం మేలనుకున్నారు…ఆఖరకు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటూ బెదిరింపులకు దిగారు…కాని తెగించి కొట్లాడే తెలంగాణ ముందు ఆ పిల్లిబిత్తిరి బెదిరింపులు పనిచేయలేదు…తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు…అరవైఏళ్లపాలు ఎండబెట్టి, పండబెట్టి తెలంగాణ విడిపోతే బాగుపడదని, తొండలు గుడ్డు పెట్టే జాగలని ఎద్దేవా చేశారు…తెలంగాణను నైరాశ్యంలో పడేసే కుట్ర పెద్దఎత్తున చేశారు…కాని కలిసి తెలుగురాగం పంచుకోవాలని వాళ్ల రోగం మన మీద రద్దాలనే పదే పదే చూశారు…ఎన్నాళ్లకైనా తెలంగాణ విడిపోతుందని తెలిసే, తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు తరలించుకున్నారు. తెలంగాణలో పైసా ఖర్చు పెట్టకుండా, సీమాంధ్రలో వెలుగులు నింపుకున్నారు…తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చారు…కలిసి వున్నన్ని రోజులు వాళ్లు పచ్చగా వుంటూ, తెలంగాణను ఎండబెట్టారు…ఇప్పుడు వాళ్లు ఎండుతూ పచ్చగైన తెలంగాణను చూసి కుళ్లుకుంటున్నారు…మళ్లీ సమైక్యం పేరుతో నక్కల రాగం అందుకుంటున్నారు…తోడేళ్లలలా కాచుకు కూర్చుకుంటున్నారు…బిజేపితో కొత్త ఎత్తులకు తెరలేపి, ఆడా వుంటాం…ఈడా వుంటాం….తెలంగాణలో ఎన్టీఆర్‌ను దింపుతాం…సీమాంధ్రలో లోకేష్‌కు పట్టం…పేరుతో రామోజీరావుతో బిజేపి సరికొత్త రాజకీయం మొదలుపెట్టింది….తెలంగాణ ఇవ్వడమే ఇష్టం లేని బిజేపి, మునుగోడులో గెలిచి తెలంగాణ రాజకీయాలను అస్ధిరం చేయాలని చూస్తోంది…! ప్రతి తెలంగాణ వాది మళ్లీ అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది…మునుగోడులో ముంచాలని చూస్తున్న వారిని తరిమితే తప్ప…తెలంగాణ వైపు ఇక చూడకుండా వుండలేరు…టిఆర్‌ఎస్‌తో పెట్టుకుంటే రాజకీయాలు చేయలేమని తెలిసొచ్చేలా చేస్తే తప్ప, అనైతిక రాజకీయాలు ఆపలేరు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!