మన ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వములో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రాష్ట్రంగా తయారు అవుతుంది…

అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతున్నాయి..

జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా:నేటిధాత్రి సిరిసిల్ల పట్టణంలోఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు మరియు హోం మినిస్టర్ మహమూద్ అలీ హైదరాబాద్ నుంచి టిఫా స్కాన్ మిషన్ ల ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ / జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి  

 

అనంతరం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టిఫా స్కాన్ మిషన్ ను చైర్ పర్సన్ ప్రారంభించారు.

 

 

ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వములో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రాష్ట్రంగా తయారు అవుతుందన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మంత్రివర్యులు కేటీఆర్ కృషితో మన జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కాబడినది అన్నారు.

మంత్రివర్యులు శ్రీ కేటి రామారావు మన జిల్లా ఆసుపత్రి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అవసరమైన డాక్టర్లను జిల్లాకు తీసుకువచ్చి, జిల్లా ప్రజలకు సకల సౌకర్యాలు, కార్పొరేట్ తరహా వైద్య సేవలు ఏర్పాటు చేసారనీ, రాజన్న సిరిసిల్ల జిల్లాని ఆరోగ్య జిల్లాగా తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

మన మంత్రివర్యులు కేటీఆర్ ప్రత్యేక చోరవతో జిల్లా ప్రజలు హైదరాబాద్, కరీంనగర్ కార్పొరేట్ హాస్పిటల్ లకు వెళ్లకుండా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లోనే వైద్యం అందేలా అధునాతన వైద్య పరికరాలను తెప్పించి కార్పోరేట్ హాస్పిటల్ స్థాయిలో వైద్య సేవలు అందేలా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిటి స్కాన్, మొబైల్ ఎక్స్ రే, పిడియాట్రిక్స్ వెంటిలేటర్స్, నియోనాటల్ వెంటిలేటర్స్, ఆప్త్మాలిక్ మైక్రోస్కోప్, టిఫా స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్, 2d ఎకో, ఫీటల్ డాప్లర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, వర్టికల్ అటో క్లేవ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి.

గ్రామాల్లో అధునాతన వైద్య సదుపాయాలు అందేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, సంక్షేమం ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుమన్ రావు, హాస్పిటల్ సూపరిండెంట్ మురళీధర్ రావు, డాక్టర్స్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!