చందుర్తి, నేటిధాత్రి:
ప్రమాదవశాత్తు చేతిని కోల్పోయిన చందుర్తి మండలం, కిష్టంపేట గ్రామానికి చెందిన యువకునికి చేయూతను అందించిన మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ .. 25 కేజీల బియ్యం 14 రకాల నిత్యవసర సరుకులు వుగిల్లే సత్తయ్య కుమారుడు జలంధర్ చెయ్యి గడ్డి కటింగ్ మిషన్ లో పడి చెయ్యి కట్ అయినా విషయం మనందరికీ తెలిసిందే ,అది చూసి స్పందించిన మన ఆపద్బాంధల ఫౌండేషన్ గౌరవ సభ్యులు జబ్బు వెంకటేష్ మరియు వారి బృందం 950 మంది .. ఈరోజు ఆ కుటుంబానికి సరుకులు అందించడం జరగింది, చెందుర్తి మండల్ కేంద్రంలోని మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ సభ్యులు వనపర్తి సతీష్ RMP, బోరుగయ్య తిరుపతి, గుంటి తిరుపతి ,పల్లి మహేందర్ పల్లి ప్రశాంత్ ,మరియు పొవరి గణేష్, వరికల శ్యామారావు ,జలంధర్ రెడ్డి, మరియు అంబిరి ప్రభాకర్ ,అంబిరి మహేష్, అలాగే కిష్టంపేట గ్రామం యువకులు పాల్గొనడం జరిగింది… మన చందుర్తి మండలంలో గత రెండు సంవత్సరాలుగా వివిధ గ్రామాలలో 14 కుటుంబాలకు మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ వారి సహాయం అందించమని, చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది కాబట్టి మునుముందు మీకు తెలిసిన వారు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వారికి ఫౌండేషన్ తరపున సహాయం చేయించడానికి మేము మా వంతు సహాయం చేస్తామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం….