మద్దూర్ నేటిధాత్రి….
మద్దుర్ 75 సంవత్సరాల స్వాతంత్ర అమృతోత్సవాల్లో ముగింపు సందర్బంగా “నా దేశం- నా మట్టి” అభియాన్ కార్యక్రమంలో, క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఈ రోజునే ప్రారంభించిన సందర్బంగా మద్దూర్ మండల మాజీ సైనికులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి, షకీల్ అహ్మద్ , ఖలీల్ అహ్మద్ లను సన్మానించిన బీజేపీ జనగామ నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు.
ఈ సందర్బంగా మాజీ సైనికులు మాట్లాడుతూ దేశ సేవకోసం భారత సైన్యంలో పనిచేసి పదవి విరమణ పొందామని, ఆ అవకాశం మాకు కలిగినందుకు అది మా అదృష్టం అని, ఎన్నో రాష్ట్రాల్లో ఉద్యోగరిత్యా పని చేశామని, మా సేవలను గుర్తుంచుకొని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించి మాలాంటి మాజీ సైనికులను, ఫ్రీడమ్ ఫైటర్స్ ను సన్మానించడం సంతోషం గా వుంది అని అన్నారు.
మేరా మిట్టి, మేరా దేశ్.కార్యక్రమంలో మనం అనుభవించే ఈ స్వతంత్రం ఎందరో మహాను భావుల పోరాట ఫలం అని స్వతంత్రంకోసం పోరాడిన అమరవీరులను స్మరించుకోవాలి అని బీజేపీ నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ గౌడ్, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి బీరప్ప, జనగాం జిల్లా అసెంబ్లీ కన్వీనర్ బల్ల శ్రీనివాస్, రేబర్తి వంగపల్లి ఎంపిటిసి కూరల రాజు గౌడ్ సీనియర్ నాయకులు రాందాస్, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ మనోజ్ కుమార్, బీజేవైఎం మద్దూర్ మండల అధ్యక్షులు రామ శ్రీకాంత్, హరీష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు..