సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో సగరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని
కోరుతూ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును శుక్రవారం కలిశారు.
రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నాయకులు కలిసి సమస్యలను వివరించారు.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో ఉన్న సగరులను బిసి ‘ఎ’ లోకి మార్చాలని, నిర్మాణ రంగం పై ఆధారపడి జీవిస్తున్న సగరులను నిర్మాణ రంగ
కార్మికులుగా గుర్తించాలని, గతంలో ఇచ్చిన జీఓ 29 ను పునరుద్దరిస్తూ సగరులకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో 15 శాతం పనులను
రిజర్వేషన్ ద్వారా ధరావతు సొమ్ము లేకుండ ఇవ్వాలని కోరారు. 60 సంవత్సరాల వయస్సు పైబడిన సగరులకు ఫెన్షన్ పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మ గౌరవ భవనం కోసం కోకాపేటలో ముందుగా కేటాయించిన స్థలాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. మంత్రి హరీష్ రావు గారు సానుకూలంగా స్పందిస్తూ కోకాపేట స్థలం మార్చకుండా ముందు కేటాయించిన స్థలాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ల పై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుంటానని తెలిపారు. ఇతర సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి తో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల బిక్షపతి సగర, గౌరవ రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆర్.బి. అంజనేయులు సగర, సలహాదారులు రాంసగర, యాదాద్రి అన్నదాన సత్ర సంఘం అధ్యక్షులు కెపి రాములు సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డేపల్లి రాములు సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి రాము సగర, మూసాపేట్ జడ్పీటీసీ గడ్డమీది ఇంద్రయ్య సగర, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, మహబూబ్నగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు సాయి ప్రణీల్ చందర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షులు మోడల రవిసగర, గౌరవాధ్యక్షులు అస్కాని వెంకటస్వామి సగర, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఏరుకొండ ప్రసాద్ సగర, నల్గొండ జిల్లా అధ్యక్షులు సందుపట్ల లక్ష్మణ్ సగర, ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సగర, కోశాధికారి దయాసాగర్, మహబూబ్ నగర్ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సగర, నర్సింలు గూడెం సర్పంచ్ విష్ణు కుమార్ సగర, మెదక్ జిల్లా అధ్యక్షులు, ఎంపీటీసి సాయికుమార్ సగర, వెంకటాయపల్లి సర్పంచ్ సక్కెర ఆంజనేయులు సగర, టీఅర్ఎస్ సీనియర్ నాయకులు బోషెట్టి భాస్కర్ సగర, గంట కృష్ణ సగర, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం సగర, సంఘం సీనియర్ నాయకులు రామకృష్ణ సగర, ఆంజనేయులు సగర, శివ సగర, చామలపల్లి మాజీ సర్పంచ్ నేర్లకంటి యాదయ్య సగర, గ్రామ కమిటీ అద్యక్షులు సగర, నాయకులు నరేష్ సగర, బల్గూరి శ్రీనివాస్ సగర, నర్సింలగూడెం గ్రామ శాఖ అద్యక్షులు లక్ష్మయ్య సగర, కల్లెట్ల శ్రీకాంత్ సగర, శంకర్ సగర, మారయ్య సగర, బిక్షమయ్య సగర, నాగరాజు సగర, నర్సింహ సగర, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షులు సీతారాం సగర, గ్రేటర్ సంయుక్త కార్యదర్శి శేఖర్ సగర, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నయ్య సగర, మూసాపేట్ వార్డు సభ్యులు రాజు సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు మోడల నర్సింహ్మ సగర తదితరులు పాల్గన్నారు.