కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భారాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటి & మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ను మహబూబాబాద్ శాసనసభ్యులు బాణా శంకర్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసారు.మహబూబాబాద్ నియోజకవర్గంలో పలు సమస్యలను కె.టి.ఆర్ దృష్టికి తీసుకెళ్లారనీ తెలిపారు.అలాగే కేసముద్రం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని మరియు పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు.