మంత్రి కేటీఆర్ ని కలసి ఎమ్మెల్యే గండ్ర దంపతులు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు కుటుంబ సమేతంగా రావాలని కోరిన గండ్ర దంపతులు
భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాద్ మెట్రో భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోత గండ్ర గౌతమ్ రెడ్డి కలిశారు
ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తో పలు అంశాలపై చర్చించారు.అకాల వర్షాలతో నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులలు, విద్యుత్తు పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించాలని కోరారు.వరద ప్రభావానికి పూర్తి దెబ్బతిన్న మోరాంచపల్లి గ్రామానికి అండగ నిలవాలని కోరారు.భూపాలపల్లి మున్సిపాలిటీ కి ఇటీవలే ప్రకటించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు.నూతనంగా కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ఔటర్ పనుల్ని వేగవంతం చేశామని, భూ సేకరణ పనులు జరుగుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు.రైతుల రుణమాఫీ అమలు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని,ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో వీలనం చేయడం శుభ శుభ సూచికమని తెలిపారు.
సెప్టెంబర్ 08వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టపణ మహోత్సవ వేడుకకు కేటీఆర్ కుటుంబ సమేతంగా రావాలని మంత్రి ని ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర