అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజన కార్మికుల మానవహారం రాస్తా రోకో
ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భద్రాచలానికి మంత్రి కేటీఆర్ వస్తున్నందున భద్రాచలం ఆఫీసు లో ఉన్న అంగన్వాడీ సీఐటీయూ నాయకులు జిలుకర పద్మ, ఎం బీ నర్సారెడ్డి,పాల్వంచలో సీఐటీయూ నేత దోడ్డా రవి కుమార్ లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దుమ్ముగూడెం పోలీసు స్టేషన్ కు తరలించడానికి నిరసనగా గుండాల లో గత ఇరవై రోజులుగా అంగన్వాడీ లు, ఆశా వర్కర్లు 6రోజులుగా గత మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు(సీఐటీయూ) ఎంఆర్ఓ, ఎంఈఓ ఆఫీసుల వద్ద గల సమ్మె శిబిరాలను ప్రదర్శనగా వచ్చి పీ హెచ్ సి సెంటర్ కూడలి వద్ద రాస్తా రోకో, మానవహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కే మరియ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా నాయకులు వజ్జ సుశీల,పాయం సారమ్మ , ఎం డి నజ్మ లు మాట్లాడుతూ ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వకపోగా సమ్మె లో ఉన్న కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యాహరిస్తున్నదని అన్నారు.ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, లేనిచో సమ్మె తీవ్రం చేస్తామన్నారు.సీఐటీయూ నేతలు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీలు కౌసల్యా,కళావతి,నీలిమ, వెంకటమ్మ,సరోజ, ఆశా లు అదిలక్ష్మి,వినోద,ఈశ్వరి,లక్ష్మీ,జయమ్మ,మధ్యాహ్న భోజన కార్మికులు పొంబాయిన లక్ష్మీ,నర్సమ్మ,చంద్రక్క,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.