భక్తి శ్రద్దలతో వినాయక నిమర్జనం…

పీర్జాదిగూడ మినీ ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా క్రెన్ ఏర్పాటు…


నేటీదాత్రీ(మేడిపల్లి):
వినాయక నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని వినాయక నిమజ్జనానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు “మినీ ట్యాంక్ బండ్” కట్టపై అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు పక్కాగా చేశామని మేయర్ జక్క వెంకట్ రెడ్డి, తెలిపారు.
ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ
వినాయక నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్ర జరిగే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతులు చేప ట్టాలని మున్సిపల్ అధికారులకు అదేవిధంగా విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు.
ఉప్పల్ డిపో, మేడిపల్లి, నుండి వరంగల్ జాతీయ రహదారి వెంట వచ్చే విగ్రహాలు (కే ఎల్ ఎమ్) మీదుగా పీర్జాదిగూడ ఓల్డ్ విలేజ్, పర్వతాపూర్ నుండి వచ్చే వినాయకులను రామకృష్ణ నగర్, మీదుగా ఒక రూట్‌మ్యాప్‌ ప్రకారం తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా క్రేన్‌లను ఏర్పాటు చేయటంతో పాటు, ప్రత్యేక విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విగ్రహాలను తీసుకు వచ్చే భక్తులు నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
నిమజ్జనం సమయంలో చెరువు సమీపంలోకి చిన్న పిల్లలను పంపకుండా , మండప నిర్వాహకులు, తల్లిదండ్రులు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *