చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:
భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా నిలుస్తూ దిన దిన అభివృద్ధి చెందుతున్న చిల్పూర్ గుట్ట చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆలయంలోని ఉత్సవమూర్తులకు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. దీనిలో భాగంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ బుగులు వెంకన్న వార కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు.దీంతో ఆలయ పరిసరాలు ఓం నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులతో పాటు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, ఆలయ సిబ్బంది ఆడెపు రమేష్,వీరన్న,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.