బెడ్‌ పాన్‌ కు దిక్కులేదు…బిజేపి అబద్దాలకు హద్దులేదు!

https://epaper.netidhatri.com/

`ఉత్తరాది రాష్ట్రాల ఆసుపత్రులలో ప్లాస్టిక్‌ బాటిలే దిక్కు!

`ఇదీ బిజేపి పాలిత ప్రభుత్వాల ఘనత.

`తెలంగాణలో వైద్య విప్లవం. https://epaper.netidhatri.com/

`గ్రామ, గ్రామాన వైద్య సదుపాయాలు.

`పట్టణాలలో బస్తీ దవఖానాలు.

`జిల్లాకో మెడికల్‌ కళాశాల.

`వరంగల్‌ లో అతిపెద్ద ఆసుపత్రి నిర్మాణం.

`హైదరాబాదు చుట్టూ నాలుగు పెద్దాసుపత్రులు!

`తెలంగాణ వైద్య సేవల్లో కొత్తగా అమ్మ ఒడి చేరిక.

https://epaper.netidhatri.com/

`వైద్య సదుపాయాలు, సౌకర్యాల కల్పనలో నెంబర్‌ వన్‌ తెలంగాణ.

హైదరబాద్‌,నేటిధాత్రి:                            మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసమంటూ మాటలు చెప్పే బిజేపి పార్టీ పదేళ్లుగా చేసిందేమీ లేదని ఒక్క ఆసుపత్రి సీన్‌ చూస్తే తెలిసిపోతుంది. మాటకు ముందు, మాటకు వెనకాల డబుల్‌ ఇంజన్‌సర్కార్‌ అంటూ గప్పాలుచెప్పుకుంటూ, ఇతర రాష్ట్రాల అభివృద్ధి ఫోటోలు ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం బిజేపికి బాగా అలవాటైపోయంది. https://epaper.netidhatri.com/ప్రజలకు సేవ చేయడం తప్ప మాటలు చెప్పడం బాగా అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా సులువు. కాని పని చేయాలంటే కష్టం. అందుకే సులువైన పనిని ఎంచుకున్నారు. పని నుంచి పక్కకు తప్పుకున్నారు. మాటల గారడీలతో రాజకీయం నెట్టుకొస్తున్నారు. తాజాగా ఓ బిజేపి పాలిత రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు ఎంత అద్వాహ్నంగా వున్నాయో! పై ఫోటో చూస్తే అర్ధమౌతుంది. అదీ బిజేపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పరిస్దితికి అద్దం పడుతుందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డో అంటూ ఓ సినిమాలో పాట వినిపించేది. ఇప్పుడు అదే ఉత్తరాధిన బిజేపి పాలిత రాష్ట్రాలలో కనిపిస్తోంది. ఆసుపత్రిలో బెడ్‌ మీద వున్న వ్యక్తికి బెడ్‌ పాన్‌ కూడా సరఫరా చేయలేని స్దితిలో అక్కడి బిజేపి ప్రభుత్వాలున్నాయంటే వారి పాలనా తీరు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నుకున్న ప్రజలకు కనీసం మౌళికవసుతుల కల్పన ఎలాగూ చేయలేదు. సౌకర్యాల కల్పన అసలే చేయలేదు. పెరుగుతున్న ధరలు నియంత్రించలేదు. కాని బిజేపికి ఎన్నికల్లో గెలుపులు కావాలి. పాలన కావాలి. అధికారం కావాలి. ప్రజా సేవ మాత్రం గాలికి వదిలేస్తున్నట్లు వుంది. 

తెలంగాణలో వైద్య విప్లవం కనిపిస్తోంది. 

ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వాసుపత్రి నిర్మాణం చేయడానికి కూడా దశాబ్ధాల కాలం పట్టేది. అసలు తెలంగాణకు ఆసుపత్రులు అంటేనే మంజూరు వుండేది కాదు. మెడికల్‌ కాలేజీల అనుమతి చేసిందేనాడూలేదు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజలకు ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు మరింత విసృతం చేశారు. పేద ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చారు. పేదలకు అతి ఖరీదైన వైద్యం కూడా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకోసం వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్‌రావు ఎనలేని కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు జిల్లాకు వంద పడకల ఆసుపత్రి ఇవ్వడం అంటే అదే గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో 33 మూడు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు వున్నాయి. వాటికి తోడు ప్రతి జిల్లాలలోనూ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా అన్ని వైద్య కళాశాలలో కూడా క్యాన్సర్‌ చికిత్సలు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ప్రభుత్వాసుపత్రిలో డయాలిసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. అంటే ప్రజలు గతంలో లాగా అత్యవసర వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా , జిల్లాల్లోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక వరంగల్‌ నగరంలో సరికొత్తగా నిర్మాణం జరుగుతున్న 2500 పడకల ఆసుపత్రి తెలంగాణకే తలమానికం కానున్నది. అంత పెద్ద వైద్యాసుపత్రి దేశంలోనే ఒకసంచనలనం. ఇదిలా వుంటే నిమ్స్‌లో కూడా మరో1500 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇటీవలే భూమి పూజ చేసిన సందర్భం చూశాం. ఇక హైదరాబాద్‌ నలువైపులా నాలుగు అతి పెద్ద ఆసుపత్రుల నిర్మాణం ఏక కాలం సాగుతున్నవి. అంటే నగర శివారు ప్రాంతాల ప్రజలు హైదారాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు రావాల్సిన అవస రం లేకుండానే హైదరాబాద్‌ నగరానికి నలువైపుల ఏర్పాటుచేస్తున్న ఆసుపత్రుల్లో సేవలు అందుకోవచ్చు. ఇక పల్లెల్లో పల్లె దవఖానాలు, పట్టణాల్లో బస్తీ దవానాలు, ఒక్క హైదరాబాద్‌లోనే సమారు 371 బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశారంటే వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంత ప్రాదాన్యతనిస్తున్నారో తెలిసిపోతోంది. తాజాగా అమ్మ ఒడి పేరుతో తల్లీ బిడ్డల సంక్షేమం కోసం దేశంలోనే ఏ ప్రభుత్వం తీసుకోనంత జాగ్రత్తలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోంది. అందుకు అవససరమైన వాహనాలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇటీవలే ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 108 సేవల కోసం ఆంబులెన్సులు ఎలా పనిచేస్తున్నాయో…డెలివరీ కోసం కూడా అమ్మ ఒడి వాహనాలు 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో అందుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యసేవల గురించి తెలిసిన పొరుగు రాష్ట్రాలు చత్తీస్‌ ఘడ్‌, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా నిత్యం పెద్దఎత్తున వైద్య సేవలకు ప్రజలు వస్తున్నారు. ఎక్కడా మందుల కొరత లేకుండా, వైద్య సిబ్బంది లోటు లేకుండా చూసుకుంటూ, పెద్దఎత్తుననిధులు కేటాయించి, ప్రజా వైద్యానికి ఎంతో ప్రాదాన్యతనిస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణలోనే… అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చలువతో..మంత్రి హరీష్‌రావు చొరవతోనే అని చెప్పకతప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!