హనుమకొండ జిల్లా నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సౌత్ మండల కార్యదర్శి నోముల కిషోర్ విమర్శించారు. శనివారం
అంబేద్కర్ సెంటర్ లో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా “వేర్ ఇస్ మై జాబ్ మోడీ” అనే నినాదంతో హన్మకొండ జిల్లా కమిటీ నాయకులు ఎన్నాము వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ నేడు మాటమార్చారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వరంగా సంస్థలను కార్పొరేట్ శక్తులకు ముట్టజెప్పి నిరుద్యోగులతో చెలగాటం అడుతున్నారన్నారు.
దేశంలో రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఖాళీ అయితే నెల గడవకముందే ఎన్నికలు గుర్తుకొస్తాయి కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రం గుర్తుకువచ్చే పరిస్థితి బీజేపీ ప్రభుత్వనికి లేదని ప్రశ్నించారు. 8 ఏండ్ల మోడీ పాలనలో యువతకు ఒడిగిందేది లేదన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోతె సతీష్, దాసరి నరేష్, సతీష్, వినయ్, శివాని, శ్రావణి, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.