మహా ముత్తారం నేటి ధాత్రి.
మంథని నియోజక వర్గం లోని మహా ముత్తారం మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు రామగిరి రాజు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ కందుగుల రాజన్న హాజరు అయ్యి కార్యకర్తలకు బీఎస్పీ పార్టీ బూత్ కమిటీల నిర్మాణం చేయాలని గడపగడపకు బీఎస్పీ కార్యక్రమాన్ని తీసుకొని బహుజన రాజ్యాన్ని సాధించేవరకు నిద్రపోకూడదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంథని నియోజక వర్గ అధ్యక్షులు రామిళ్ల రాకేష్ స్థానిక నిమ్మగూడెం గ్రామానికి చెందిన జనగామ మహేష్ ని బీఎస్పీ మహా మూత్తారం మండల ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది మహేష్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన మండల అధ్యక్షుడు రామగిరి రాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను.డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ని ముఖ్యమంత్రి అయ్యే వరకు నా వంతు పాత్రను నిర్వహిస్తానని బీఎస్పీ ని మండల కేంద్రంలో గ్రామ గ్రామానికి తీసుకెళ్తానని నాకు ఈ అవకాశం కల్పించిన బీఎస్పీ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జనగామ సంతోష్, బిఎస్పి యూత్ అధ్యక్షులు పులియల నరేం తదితరులు పాల్గొన్నారు.