చేర్యాల నేటిధాత్రి…
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని బీఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం వేదమంత్రాలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ మండపంలో కొమురవెల్లి మల్లన్నకు పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భారీ బైక్ ర్యాలీతో కొమురవెల్లి నుండి జనగామకు బయలుదేరారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బద్ధిపడగ కృష్ణారెడ్డి, ఉల్లంపల్లి కరుణాకర్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అంకుగారి శ్రీధర్ రెడ్డి, కొమురవెల్లి జెడ్పిటిసి సిద్దప్ప, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.