బొజ్జ హేమంత్ పరకాల నియోజకవర్గం ఇంచార్జ్
పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల లోని స్థానిక బిసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ వెంకట రాజం గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ హాస్టల్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జ హేమంత్ మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ విద్యార్థుల పట్ల హాస్టల్ పట్ల చాలా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.విద్యార్థులకు ఉదయం టిఫిన్స్ మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనాలు బాగుండట్లేవని వాళ్ళు సార్లు చెప్పిన వారు పట్టించుకోవడంలేదని అన్నారు.విద్యార్థులు హాస్టల్ భోజనాలు తినక బయటకెళ్ళి డబ్బులు పెట్టి భోజనాలు తెచ్చుకొని కర్రీస్ తెచ్చుకొని తింటున్నారని పేర్కొన్నారు అలాగే హాస్టల్ సమస్యలు తెలుసుకుందామని వచ్చే విద్యార్థి సంఘాల నాయకులపై విద్యార్థులను ఉసిగొలిపే విధంగా హాస్టల్ వార్డెన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. మరి ముఖ్యంగా బీసీ హాస్టల్ కిటికీలు తెరిచి ఉండడం వల్ల పక్కనే ఉన్న బాలికల హాస్టల్ విద్యార్థినిలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని వారు చెప్పినా కూడా ఏమాత్రం పట్టింపు లేని విధంగా హాస్టల్ వార్డెన్ వెంకట రాజం అసలు విధులు నిర్వహిస్తున్నారని ఉన్నత అధికారులు వెంటనే స్పందించి బీసీ హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండల అధ్యక్షులు కోకిల ప్రేమ్, పట్టణ కార్యదర్శి కోకిల సాయితేజ,ప్రభుత్వ జూనియర్ జూనియర్ కాలేజ్ అధ్యక్ష కార్యదర్శులు నూతన్,కార్తీక్ గణపతి డిగ్రీ కాలేజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, ముజాహిద్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పరకాల నాయకులు యశ్వంత్, సుజ్వల్, సునీల్, బబ్బు విద్యార్థులు పాల్గొన్నారు.