బిసి నేతలు ఎదుగొద్దా! బతకొద్దా!?

` రాజకీయాలలో హత్యా రాజకీయాలకు తావులేదు.

`రాజకీయాలన్నీ ఆత్మహత్యా సదృశ్యాలే!

`బిసి. నేతలను నిర్మూలించి ఎన్నేండ్లు రాజకీయం చేస్తావు?

`వెయ్యేండ్లు బతికి పదవులు అనుభవిస్తావా?

`పార్టీయే నమ్మక పిసిసి ఇవ్వలేదు!

`కోమటి రెడ్డి సమర్థత ఎంతో అక్కడే తేలిపోయింది?

`చెరుకు సుధాకర్‌ చిన్న నాయకుడైతే అంత భయమెందుకు?

`రేవంత్‌ రెడ్డిని ఎదిరించే ధైర్యం లేదు?

`బిసి.నేతల మీదనా నీ ప్రతాపం?

`తెలంగాణ ఉద్యమ సమయంలో పిడి.యాక్ట్‌ ఎదుర్కొన్న ఏకైక నాయకుడు చెరుకు సుధాకర్‌.

`నల్గొండ జిల్లాలో ఎంతో మంది బిసి నేతల రాజకీయ జీవితాలు నాశనం చేసినట్లు అనేక ఆరోపణలు?

`ఇప్పటికే పార్టీలో ఎవరూ నమ్మడం లేదు?

`కాంగ్రెస్‌ లో టిక్కెట్‌ వస్తుందో నమ్మకం లేదు?

`ఎప్పుడు గోడ దూకుతావో ఎవరికీ తెలియదు?

`పార్టీని ఖతం చేసే పనిలో, నేతలను కూడా లేపేస్తావా?

`ఇంతేనా ఇన్నేళ్ల రాజకీయం నేర్పిన పాఠం!

` ఇదేనా ఇంత కాలం అనుసరించిన అరాచక రాజకీయం!

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో అసహనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో రాయలసీమలో ఇలాంటి వాతారణం వుంటుందని అంటుండేవారు. కాని కోమటి రెడ్డి వెంకటరెడ్డిలా తన రాజకీయ ప్రత్యర్ధులను ఏకంగా వంద మంది వెతుకుతున్నారు..వేసేస్తారు? అని చెప్పేంత ధైర్యం ఎవరూ చేసి వుండదు. రాజకీయాలకు దూరంగా వున్నవారో..లేక వ్యాపారాలలో ప్రత్యర్ధులలో..తగాదాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి చూసి వుంటాం…కాని ఒకే పార్టీలో వుంటూ, మరో నాయకుడిపై భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఇటీవల వీపతీరంగా అసహం పెరిగిపోయినట్లుంది. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. పార్టీలో వుండాలో వద్దో తేల్చుకోలేకపోతున్నాడు. తమకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేదనుకున్నాడు. తమకు ఎదురులేదనుకున్నాడు. ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ రావడంతో ప్రజలు తమ వైపు వున్నారన్న అహంభావం మరీ ఎక్కువైంద. ఎవరిని పడితే వారిని తిడుతున్న్డాడు. దూషిస్తున్నాడు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగా వుంటూ వస్తున్నారు. అసమ్మతి నేతైనంత మాత్రాన ఆయనేం బలమైన నేత అన్నది ఎవరూ అనుకోడం లేదు…పార్టీ కూడా గుర్తించలేదు. కాకపోతే ఎన్నికల్లో అడిన చోట్లల్లా టిక్కెట్లు ఇస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన సోదరుడైన రాజగోపాల్‌రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చాడు. రాజశేఖరెడ్డి ఆశీస్సులతో తన తమ్ముడికి ఎంపి టిక్కెట్టు ఇప్పించుకున్నాడు. గెలిచారు. కాని 2014 ఎన్నికల్లో అన్న గెలిచాడు. తమ్ముడు ఓడిపోయాడు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చింది. తర్వాత 2018లో మునుగోడు టిక్కెట్టు తమ్ముడికి, నల్లగొండ టిక్కెట్టు అన్న తీసుకున్నారు. ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయాడు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి గెలిచాడు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ వెంకటరెడ్డికి పార్టీ భువనగిరి ఎంపి టిక్కెట్‌ ఇచ్చింది. ఇంతగా పార్టీ అన్నాదమ్ములకు ప్రోత్సాహం ఇచ్చినా పార్టీని వెన్నుపోటు పొడిచారు. తమ్ముడు పార్టీ మారాడు. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడు. వున్న పదవి పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే రాజగోపాల్‌ మునుగోడు బరిలో నిలిచాడో అప్పటినుంచి అన్నకు అసహనం విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది.

 రాజగోపాల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వున్నప్పుడే ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖతమైందంటూ బిజేపి వైపు చూశాడు. 

తమ్ముడు రాజీనామా చేసిన తర్వాత అన్న అదే రాగం అందుకున్నాడు. భవిష్యత్తు బిజేపిదే అంటూ, కాంగ్రెస్‌లో వుంటూ తమ్ముడి వైపు సైలెంటు ప్రచారం నిర్వహించాడు. అబాసు పాలయ్యాడు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా సొంతపార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతూ వస్తున్నాడు. చివరికి తెలంగాణ ఉద్యమకారుడైన చెరుకు సుధాకర్‌ గౌడ్‌ను చంసేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. వంద మంది ఆయన కోసం వెతుకుతున్నారంటూ సుదాకర్‌గౌడ్‌ కొడుకుతో ఫోన్లో బెదిరించాడు. సుధాకర్‌ గౌడ్‌కొడుకు హాస్పిటల్‌ను నాశనం చేస్తానన్నాడు. చెరుకు సుదాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం అన్నది ఆది నుంచి వెంకటరెడ్డికి నచ్చలేదు. ఆయన రాకను వెంకటరెడ్డి వ్యతిరేకించాడు. 

 కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆది నుంచి చెరుకు సుధాకర్‌ కొరకరాని కొయ్యగా మారుతూ వస్తున్నాడు.

 దాంతో సుధాకర్‌పై ఇలాంటి వాఖ్యలు చేశాడు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా వున్న సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఆ సమయంలో చెరుకు సుధాకర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారుడిగా పదేపదే కాంగ్రెస్‌పై విరుచుకుపడుతుండేవారు. అది వెంకటరెడ్డికి అనేక సార్లు ఇబ్బందులకు గురి చేసింది. ఇదే సమయంలో చెరుకు సుధాకర్‌పై పడి. యాక్ట్‌ పెట్టారు. ఆయనను వరంగల్‌ జైలుకు పంపారు. ఇందులోనూ కోమటిరెడ్డి ఒత్తిళ్లే కారణమన్నది అప్పట్లో చెప్పుకుంటుండేవారు. కాకపోతే తాను తెలంగాణ వాదినే అని చెప్పుకొని మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత వెంకటరెడ్డి వరంగల్‌ జైలులో సుదాకర్‌ను కలవడం జరిగింది. తాను సుధాకర్‌కు వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపారు. అయినా వారి మధ్య వార్‌ నడుస్తూనేవుంది. ఇది ఇటీవల కాలంలో మరింత పెరిగింది. అప్పుడుంటే చెరుకు సుధాకర్‌ టిఆర్‌ఎస్‌ వుండేవారు. తర్వాత ఆయన సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీ పెట్టుకున్నాడు. కాని ఇప్పుడు సుధాకర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో వున్నాడు. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని ఓడిరచడంలో కీలక పాత్ర పోషించాడు. రాజగోపాల్‌రెడ్డికి పట్టున్న చౌటుప్పలోనే ఓట్లు పడకుండా రాజకీయం నడిపాడు. అప్పటినుంచి చెరుకు సుధాకర్‌ మీద వెంకటరెడ్డి మరింత కోపం పెంచకున్నాడన్నది వినిపిస్తున్న మాట. అయితే తాజాగా జరిగిన వివాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యుత్సాహానికి పోయి, గతంలో అద్దంకి దయాకర్‌ విషయంలో చేసిన దూకుడే ఇప్పుడూ ప్రదర్శించాడు. కాకపోతే బొక్కా బోర్లా పడ్డాడు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను పూర్తిగా చూడకపోతే ఏమౌతోందో అన్నది వెంకటరెడ్డి ఉదంతమే సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పాలి. పైపైన వుండే నాలుగు అక్షరాలు చేసి, ఆవేశపడితే మొదటికే మోసం వస్తుందని తెలిసి కూడా కొన్ని సార్లు తొందరపాటు ఎంత పనిచేస్తుందో వెంకటరెడ్డికి బాగా తెలిసి వచ్చింది. నిజానికి సుధాకర్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు తననే అనుకొని, తనకు ఆపాదించుకొని వెంకటరెడ్డి రెచ్చిపోయాడన్నది అసలు సారాంశం. 

  చెరుకు సుధాకర్‌ గౌడ్‌ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో వెంకటరెడ్డికి నూకలు చెల్లినట్లే అంటున్నారు. 

ఆది నుంచి కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి నిత్య అసమ్మతివాదిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తాను పార్టీకి సేవ చేశానని అంటున్నారే గాని, తనకు పార్టీ అవకాశం కల్పించిందన్న సంగతిని మర్చిపోతున్నారు. అంటే తన వల్లే కాంగ్రెస్‌ బతికి బట్టకట్టిందన్నంత అతివిశ్వాసానికి వెంకటరెడ్డి వచ్చారని విమర్శలున్నాయి. పైగా వెంకటరెడ్డి ఎప్పుడూ ఒక్క మాట మీద నిలవడడు అన్న అపవాదు కూడా వుంది. ఇంకా కాంగ్రెస్‌పార్టీ వెంకటరెడ్డిని భరించే పరిస్థితుల్లో లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి వైపు కన్ను గీటుతూ, మరో వైపు కాంగ్రెస్‌లో కొనసాగుతూ, అవకాశం వస్తే మరెటైనా దూకేందుకు సిద్దంగా వెంకటరెడ్డి వుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలంగాణలో వైసిపి వుంటే వెంకటరెడ్డి ఖచ్చితంగా ఈపాటికి చేరిపోయేవారని, ఒక వేళ షర్మిల పార్టీ బలంగా వుంటే ఆపార్టీలోకైనా వెళ్లిపోయేవారే అంటున్నారు. వైసిపి లేదు…షర్మిల పార్టీ అనుకున్నంత గొప్పగా లేదు. ఇప్పటికైతే కాంగ్రెస్‌లోనే వుంటూ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, అప్పుడు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకే వెంకటరెడ్డి ఆగుతున్నాడు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డికి టిక్కెట్టు దక్కే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. ఆయన ఎలాగూ ఎంపిగా వున్నారు. ఆయనకు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే మిగతా అసమ్మతి వాదులకు అవకాశం కల్పించినట్లైంది. అంతదాకా ఎందుకు మొన్నటిదాకా ఆయన వెంట నడిచిన వారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా వెంకటరెడ్డి వ్యవహార శైలిని నచ్చడం లేదట. అందుకే ఈ మధ్య మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనం. ఇప్పుడు బిసి నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడైన చెరకు సుధాకర్‌ గురించి చేసిన వ్యాఖ్యల మూలంగా ఆయన రాజకీయ భవిష్యత్తు తలకిందులయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయం నేటిధాత్రి కూడా ఎప్పుడో చెప్పింది. మునుగోడు ఎన్నికల సమయంలో కోమటి రెడ్డి సోదరులు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది బిసి నేతలను ఎదకుండా చేశారన్నదానిపై కూడా సమగ్ర కధనం కూడా ప్రచురించింది. అయినా వెంకటరెడ్డి తన సహజశైలిని మార్చుకోలేదు. అందుకే అహం బైటపడిరది….రాజకీయ భవిష్యతుకు ఎసరు రానున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!