బిజేపోళ్లు బిత్తరపోయారు?

`సభ ఎందుకు పెట్టినట్లో అనుకుంటూ జుట్టు పీక్కున్నారు?

`మోడీ సభ అంటూ బాగానే బిల్డప్పిచ్చారు?

`అందరి గాలి మోడీ చల్లగా తీశాడు.

`డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అన్న ముచ్చట తీయలేదు.

`ప్రభుత్వంతో కొట్లాడండి అని చెప్పలేదు.

`రాష్ట్ర నేతలు చెప్పింది చెప్పినట్లు, అప్పజెప్పిపోయాడు.

`బిజేపి నేతలు తెల్ల మొహం వేశారు.

`కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదు.

`అబ్‌కి బార్‌ బిజేపి సర్కార్‌ అని ముగించారు.

` బిజేపి శ్రేణులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప దనం తెలిసేలా చేశాడు.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనా దక్షతతో తెలంగాణకున్న ప్రాధాన్యత గురించి చెప్పి వెళ్లారు.

`మీకు అర్థమౌతుందా?

`స్టేజిని చూసి మోడీ నిరాశ చెందినట్లున్నాడు

`వలసవాదులను చూసి అవాక్కైనట్లున్నాడు.

`అందుకే ఎవరి పేరు ఉచ్చరించకుండానే స్పీచ్‌ ఇచ్చారు.

`ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ మూలాలు ఉన్నవాళ్లు ఇద్దరూ ముగ్గురే

`మిగిలిన వాళ్ళందరూ అవసరానికి వచ్చిన వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలే?

`ప్రజలను చూసి సంతోషపడ్డాడు! స్టేజిని పై ఉన్న వాళ్లని చూసి నిరాశ చెందినట్లున్నాడు!!

`ఒక్క బండి సంజయ్‌ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూసి మోడీ సంతోషించినట్లున్నాడు.

`బండి సంజయ్‌ మార్పుపై మధనపడ్డట్లున్నారు.

`కిషన్‌ రెడ్డికి అంత పవర్‌ లేదని తెలుసుకున్నట్లున్నాడు.

`బిజెపిని రెడ్లు ఆక్రమించేసి బీసీలకు దూరం చేస్తున్నారేమో అనుకున్నట్లున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వరంగల్‌ వస్తున్నాడు. 8వ తేదీ ఎప్పుడొస్తుంది? ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతాడు? పార్టీ శ్రేణులుకు పూర్తి భరోసా కల్పిస్తాడు. దిశానిర్ధేశం చేస్తాడు. పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో హిత బోధ చేస్తాడు. అగ్రహోదగ్రుడిలాగా బిఆర్‌ఎస్‌ మీద ఆరోపణాస్త్రాలు సంధిస్తాడు. విమర్శల జడివాన కురిపిస్తాడు. సగటు బిజేపి శ్రేణుల్లో ఉత్సాహం నింపి వెళ్తాడు. తెలంగాణ బిజేపికి ఒక ఊపు తీసుకొస్తాడు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు ప్రస్తావన తెస్తాడు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివిరిస్తాడు. తెలంగాణను ఏం చేశామో చెబుతాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో లెక్కలు చెబుతాడు. భవిష్యత్తులో తెలంగాణకు ఏం చేస్తామో చెప్పి వెళ్తాడు. ఇతర బిజేపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్దిని వివరిస్తాడు. గుజరాత్‌ మోడల్‌ను గుర్తు చేస్తాడు. అక్కడి ప్రగతిని తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరిస్తాడు. మేకిన్‌ ఇండియా గొప్పదనం అందరికీ వినిపించేలా చెప్తాడు. పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారపడతాడు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి అంటూ ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని గిర్జస్తాడు. ఇక కొట్లాడండి అని బిజేపి శ్రేణులను ఉత్సాపరుస్తాడు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, పార్టీకి ఊపరి సల్పకుండా చేస్తాడు? ఇది శనివారం ఉదయం వరకు రాష్ట్ర బిజేపి పెద్దలు, నాయకులు, శ్రేణులు, సగటు కార్యకర్తలు కొంత కాలంగా నిద్రాహరాలు మాని ఎదురుచూసిన తరుణం. 

 పాపం..వాళ్లు ఒకటి ఆలోచిస్తే..ప్రధాని మోడీ మరొకటి చెప్పాడు. ఒక్కసారిగా నిద్రలో వున్న వాళ్లకు మెలకువ వస్తే ఎలా ఉలిక్కిపడతారో..అలా బిజేపి నేతలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే ప్రధాని తన ప్రసంగం ముగించారు.

 ఇదీ ఈ రోజు బిజేపి నేతలకు కళ్లు బైర్లు కమ్మిన రోజు. ఇన్ని రోజుల పాటు ఎదరుచూసిన దానిలో కనీసం ఒక వంతు కూడా ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ సభను మించి బిజేపి సభ జరుగుతుందని గొప్పలకు పోయారు. పెద్ద భహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన కూడా పెద్ద విదామైంది. పత్రికా ప్రకటలనపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాహుల్‌ గాంధీ సభను మించిన సభ జరుగుతుందని అందరూ ఊహించారు. ప్రధాని మోడీ ప్రసంగంపై బిజేపి శ్రేణులు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఊహించినంత స్ధాయిలో రాష్ట్ర బిజేపి సభ నిర్వహించలేదు. బిజేపి శ్రేణులు కలగన్నట్లు ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. అటు, ఇటూ సప్పగానే తోచింది. బిజేపి కార్యకర్తలకు కొంత కోపం వచ్చింది. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంత కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, బిఆర్‌ఎస్‌ మీద విరుచుకుపడుతున్న బిజేపి నేతల గాలి ప్రధాని మోడీ తీసి వెళ్లిపోయారు? ఇది ఎవరో అంటున్న మాట కాదు…సాక్ష్యాత్తు సభ దగ్గరే బిజేపి శ్రేణులు తిట్టుకున్న వ్యాఖ్యలు?

వరంగల్‌ సభ ప్రధాని మోడీకి నచ్చనట్లు వుంది. ఆ సభా వేదిక మీదకు రాగానే ప్రధాన మంత్రి మోడీకి అది బిజేపి వేదికలాగా కనిపించినట్లునట్లుంది.

 కింద వున్న కార్యకర్తలు బిజేపిని అనువణువూ నింపుకున్న వాళ్లు. కాని వేదిక మీద వున్నవాళ్లు అద్దె నేతలు. అరువు నేతలు. అవకాశవాదం కోసం బిజేపిలో చేరిన వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలు. వారి రాజకీయ భవిష్యత్తు కోసం కాషాయకండువా కప్పుకున్నవారు. అంత పెద్ద వేదిక మీద అసలు బిజేపి నేతలుగా కనిపించింది ముగ్గురే..ఒకరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మూడు బండిసంజయ్‌. అంతే ముందు వరసలో చూసినా, వెనక వరుసలో వున్న వాళ్లంతా రాజకీయ అవసరార్ధం చేరిన వాళ్లే…అందుకే ప్రధాన మంత్రి మోడీ బిజేపి సభలో ఏ ఒక్క నాయకుడిని పేరును ప్రస్తావించలేదు. కనీసం సభ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పలేదు. ఆఖరకు సభకు విచ్చేసిన బిజేపి శ్రేణులకు అభివాదం కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఆఖరున ఔర్‌ ఏక్‌ బార్‌ బిజేపి సర్కార్‌ అని మూడుసారు శ్రేణులతో అనిపించి ముగించారు. అంటే ఆయనకు ఆ సభ నిర్వహణ మీద ఎలాంటి సదాభిప్రాయం లేదన్నది అర్దమైంది. కేవలం బండి సంజయ్‌ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ప్రధాని మోడీ ఆసక్తిగా గమనించారు. బండి సంజయ్‌ మాట్లాడుతుంటే పార్టీ శ్రేణులు ఈలలు వేస్తుంటే సంతోషించాడు. అంతకు మించి ప్రధాని మోడీ ఒక్కసారి కూడా వేదికపై చిరునవ్వు నవ్వలేదు. గతంలో బండి సంజయ్‌ నేతృత్వంలో జరిగిన రెండు మూడు సభల్లో ప్రదాని మోడీ పలు మార్లు చిరునవ్వులు చిందించారు. బండి సంజయ్‌ను భుజం తట్టారు. ప్రజలను బండికే చూపిస్తూ మురిసిపోయాడు. వరంగల్‌ సభలో అలాంటి సన్ని వేశం కనిపించలేదు. ఎవరినీ ప్రధాని మోడీ ఎవరినీ భుజం తట్టలేదు. వరంగల్‌ సభలో మాత్రం ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు. కనీసం సంతోషంగా వున్నట్లు కూడా కనిపించలేదు. అంతే కాదు ప్రధాని ఊహించిన దానికి బిజేపి ఏర్పాటు చేసిన సభను చూసిన తర్వాత కొత్త అధ్యక్షుడైన కిషన్‌రెడ్డి పనితనం ఏమిటో కూడా అర్దమైనట్లుంది. 

 ఇదిలా వుంటే ప్రధాని మోడీ పదినిమిషాల వ్యవధిలో చెప్పిన రెండు రకాల వ్యాఖ్యలకు బిజేపి శ్రేణులు బిత్తరపోయాయనే చెప్పాలి.

 ఓ వైపు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఎంత కీలకమో చెప్పారు. తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో చెప్పారు. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పారు. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చి తెలంగాణ గొప్పదనాన్ని వివరించారు. అంటే ఇదంతా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసినట్లే..ముఖ్యమంత్రి కేసిఆర్‌ పనితీరుకు కితాబిచ్చినట్లే…అయితే బిజేపి ఏర్పాటు చేసిన సభలో ఏదో ఒకటి మాట్లాడాలి. అందువల్ల ప్రధాని తనదైన శైలికి భిన్నంగా తెలంగాణ బిజేపి నేతలు ఏం చెప్పారో అవే విషయాలు ఉటంకించారే తప్ప, ఆయన కొత్తగా చెప్పినట్లు లేదు. గట్టిగా చెప్పినట్లు అసలే లేదు. దాంతో బిజేపి శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఇదే సభలో అటు ఈటెల రాజేందర్‌ , కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తోడుగా ప్రధాని పంచులు వుంటాయని అనుకున్నారు. కాని ప్రధాని కనీసం మాటల మతాబులు కూడా పేల్చలేదు. ఇదీ సంగతి..అర్ధమైందా? రేపటి భవిష్యత్తు ఇదే అని బిజేపి శ్రేణులకు అర్దమైనట్లుంది. 

 ఇదిలా వుంటే ప్రధాని మోడీ సభ పూర్తయిన వెంటే బిఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యారోపణలు సంధించారు.

 కేంద్ర బిజేపి వైఫల్యాలు ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని లెక్కలు చెప్పారు. ఇవ్వాల్సిన వాటి గురించి ప్రజలు వివరించారు. తెలంగాణకు బిజేపి తీరని అన్యాయం చేస్తోందన్న సంగతి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ ప్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు మెడికల్‌ కాలేజీల మంజూరులో ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. కనీసం నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని రాష్ట్ర్రమంత్రులు, ఎమ్మెల్యేలు, బిఆర్‌ఎస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. ఇదీ అసలు సిసలు కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!