బిజేపి పతనం ప్రారంభం!

`కర్ణాటక తొలి సైరన్‌!

`రాజకీయంగా బిజేపికి మూడిరది?

` మోడీ ముసుగు తొలగిపోయింది?

`బిజేపి కర్ణాటక ప్రజల మన్ననలు పొందలేకపోయింది?

` బిజేపి అవినీతిపై ప్రజల తీర్పు చారిత్రకం.

`కర్ణాటక ఫలితాలపై నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎమ్మెల్సీ పోచంపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.

`బిజేపి తిరోగమనం మొదలైంది?

`మళ్ళీ రెండు సీట్లకు పడిపోయే కాలమొచ్చింది?

` బిజేపికి వ్యతిరేకంగా తొలి గొంతు కేసిఆర్‌ దే!

`ఆది నుంచి కేసిఆర్‌ అంటే బిజేపి భయపడుతున్నదే?

`ఇక దేశ వ్యాప్తంగా ప్రశ్న మొదలైనట్లే?

`బిజేపిపై పోరుకు సమయం ఆసన్నమైనట్లే?

` కేసిఆర్‌ తిరుగుబాటుకు అందరూ కలిసి రావాల్సిందే!

`నిన్నటి దాకా మాట్లాడాలంటే కూడా ఆలోచించేవారు.

` కేసిఆర్‌ ధైర్యాన్ని ప్రతిపక్షాలు మెచ్చుకుంటున్నాయి.

`కర్నాటక తో బిజేపి దక్షిణాదిన ఖాళీ అయినట్లే?

` దేశ వ్యాప్తంగా బిజేపి మీద తీవ్ర వ్యతిరేకత?

` ఉత్తరాదిలో కూడా మార్పు స్పష్టం!

` వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బిజేపి కి చుక్కలే?

`కర్ణాటక లో బెడిసి కొట్టిన బిజేపి వ్యూహం?

`ప్రతిసారీ మతరాజకీయం బిజేపికి గుణపాఠం?

` ప్రజలు అభివృద్ధి కోరుకోవడం సహజం?

` మతాన్ని అడ్డుపెడ్డుకొని ఇంకెంత కాలం చేస్తారు రాజకీయం?

`అభివృద్ది తమ వల్ల కాదని తేల్చేసిన బిజేపి?

`అనైతిక పాలనకు వ్యతిరేకంగా కర్ణాటక బలమైన తీర్పు?

` బిజేపి రాజకీయాలకు చెంపపెట్టు?

`మోడీ మానియా పని చేయలేదు?

`ఎన్ని సభలు పెట్టినా, రోడ్‌ షోలు చేసినా ఓట్లు పడలేదు?

`అమ్మకాలు తప్ప అభివృద్ధి తెలియని బిజేపికి సరైన గుణపాఠం?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ప్రశ్నకు పర్యాయ పదం ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన ఒక ప్రశ్నకు రూపం. నిలువెత్తు నిదర్శనం. ఒకనాడు తెలంగాణ కోసం ప్రశ్నించారు. ఆ ప్రశ్నలోనే తెలంగాణ సాధనను వెతికాడు. తెలంగాణ మొత్తం ఒక్కటి చేశాడు. తెలంగాణ స్వరూపమే ఉద్యమ రూపంగా మార్చాడు. అలా కేసిఆర్‌ నిత్య ప్రశ్నలా నాటి పాలకులను నిలదీశాడు. నాటి కేంద్ర పాలకులు తెలంగాణ ఇచ్చేలా చేశాడు. ఇప్పుడు దేశం కోసం ప్రశ్నిస్తున్నాడు. దేశం సుభిక్షం కోసం ప్రశ్నిస్తున్నాడు. సుజలాం, సుఫలాం అని చెప్పుకోగానే సరిపోదు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని పాలకులు కోరుకోవాలని సూచిస్తున్నాడు. కేంద్రంలో వున్న బిజేపిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు. నిలదీస్తున్నాడు. దేశాన్ని ఏకం చేస్తున్నాడు. దేశంలోని రాష్ట్రాలన్నీ ఏక గొంతులు చేస్తున్నాడు. వాటికి జరుగుతున్న అన్యాయాలపై కేసిఆర్‌ ప్రశ్నిస్తున్నాడు. రైతులకు జరుగుతున్న అన్యాయాలపై నిలదీస్తున్నాడు. రైతు సంక్షేమం కోరకపోతే ఏం జరగుతుందో వివరిస్తున్నాడు. సుసంపన్నమైన మన దేశంలో సమగ్రాభివృద్ది నిత్య పర్యాయం కావాలి. అంతే కాని ఆకలి కేకలు ఎందుకుంటున్నాయన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో బిజేపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై గళమెత్తుతుడున్నాడు. అందుకే జాతీయ స్ధాయిలో ప్రజా వాణిని వినిపించేందుకు బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశాడు. రాష్ట్రాలన్నింటిలో చైతన్యం రగిలించే ప్రయత్నం చేశాడు. కేసిఆర్‌ మాట్లాడడం మొదలుపెట్టిననాడు మిగతా రాష్ట్రాల నాయకత్వాలు చలించలేదు. మొదట తెలంగాణ ఉద్యమం కేసిఆర్‌ మొదలుపెట్టిన నాడు ఎలాంటి నిశ్శబ్ద వాతావరణం వుందో..కేసిఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టడం మొదలుపెట్టిన నాడు కూడా అదే శూన్యం ఆవహించి వుంది. అయినా ఆనాడైనా, నేడైనా కేసిఆర్‌ అడుగు వెనక్కి వేయలేదు. ముందడుగే ఎంచుకున్నాడు. ముందుకు సాగాడు. ఆనాడు తెలంగాణ సాధించాడు. నేడు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రాలకు నోరొచ్చేలా చేశాడు. దాంతోపాటు కర్నాటక ఎన్నికల ఫలితాలు బిజేపి నోరు మూయించాయి. జనాన్ని మతం మత్తులో ఎళ్ల కాలం వుంచి రాజకీయం చేయడం కుదరదు. మతం సమ్మతమే అయినా కడుపు నింపదు. ఆకలి తీర్చదు. జీవితాలను చిద్రం చేసే ఆవేశాలను మాత్రమే మతరాజకీయం రగిలిస్తుంది. అందుకే మన దేశం లౌకిక వాద దేశం. మన రాజ్యాంగం ఈ విషయాన్ని సుస్పష్టంగా చెబుతోంది. అయినా బిజేపి మత రాజకీయం తప్ప మరో రాజకీయం ఎంచుకోవడం లేదు. ఎన్నికలు ఏవైనా సరే మతం తప్ప మరో అంశం ఎంచుకునే మార్గంలోనే నడుస్తుంది. అయితే మన దేశాన్ని కొన్ని వందల ఏళ్లపాటు ఏ మతస్తులు పాలించినా మన దేశ మూలాలు ఎవరూ మర్చాలేకపోయారు. మన మతం జోలికి వచ్చే సాహసం చేయలేకపోయారు. కాని ఇప్పుడు బిజేపి చేస్తున్న విభజించు పాలించు రాజకీయాలే ఆనాడు చేశారు. అదే దారిలో నేడు బిజేపి పయనిస్తోంది. అంతే తేడా..అంతే కాని హిందువుల మీద బిజేపికి పెద్దగా ప్రేమ లేదు. కేవలం రాజకీయాల కోసమే మత రంగు పులుముకున్నట్లు నటిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో రామ మందిరం నిర్మాణం చేస్తున్న బిజేపి, మన భద్రాచల రాముడికోసం ఎందుకు చేయడం లేదు. ఆ రాముడు, ఈ రాముడు ఒక్కటే కదా? అందుకే హిందువులను ఉద్దరిస్తున్నామని బిజేపి చేసుకుంటున్న ప్రచామంతా డొల్ల. కర్నాటకలో బిజేపి చేసిన మత విన్యాసాలు చూసి జనం నవ్వుకున్నారు. బిజేపిని అదే ప్రజలు నవ్వుల పాలు చేశారు. నాలుగు సంవత్సరాల కాలంలో విపరీతంగా ధరలు పెంచి, ఎలాగూ ఓడిపోతున్నామని తెలిసి, కర్నాకటలో కుటుంబానికి అరలీటరు పాలు ఉచితంగా ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? ఆ మాయ మాటలు ఇంకా వింటారా? వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను విపరీతంగా పెంచేసి, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెబితే నమ్మదగిన మాటలేనా? అందుకే కర్నాటక ప్రజలు బిజేపికి కర్రు కాల్చి వాతలు పెట్టారు. అంటూ బిజేపి అరాజకీయంపై నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో ఎమ్మెల్సీ పోచంపల్లిశ్రీనివాస్‌రెడ్డి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు మీ కోసం..ఆయన మాటల్లోనే…

నిత్యం మతం పేరు చెబితే సరిపోతుందా? 

ధర్మం గురించి ప్రస్తావిస్తూ, అధర్మ రాజ్యమేలుతుంటే జనం ఊరుకుంటారా? నిత్యం దేశం, ధర్మం అంటూ మతం ముసుగులో బిజేపి చేస్తున్న రాజకీయం ప్రజలు గుర్తించారు. అందుకే కర్నాటకలో బిజేపిని విసిరి అవతల పారేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 18 సభలు, 16 ర్యాలు, 6 రోడ్‌ షోలతో ప్రచారం చేసినా, దేశంలోని ఇతర బిజేపి నేతలంతా కర్నాటకలో మకాం వేసి ఊదరగొట్టినా ప్రజలు నమ్మలేదు. బిజేపిని ఆదరించలేదు. ఇప్పటికైనా బిజేపి నీతిని నమ్ముకొని రాజకీయాలు చేయడం తెలుసుకోవాలి. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి మోడీ కూడా అబద్దాల రాజకీయం చేస్తానంటే ప్రజలు సహిస్తారా? అందుకే కర్నాటకలో బిజేపి మళ్లీ కోలుకోకుండా తీర్పునిచ్చారు. బిజేపి పతనం కర్నాకట నుంచే మొదలౌతుందని సంకేతాలిచ్చారు. దక్షిణాదిని బిజేపి చిన్న చూపు చూస్తుందన్న సంగతి తెలిసినా, స్ధానిక బిజేపి నేతలు మాట్లాడకపోవడం, కేంద్ర పెద్దలకు వత్తాసు పలకడం కూడా బిజేపి కొంప ముంచింది. దక్షిణాది ఆత్మగౌరవం దెబ్బతీసేలా పెరుగు ప్యాకెట్లపై దయి అని హిందీలోనే పేరు వుండాలని తెచ్చిన ఒత్తికి కన్నడిగులు కన్నెర్ర చేశారు. అన్ని రకాలుగా బిజేపి అసమర్ధ అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని అవినీతిని చేస్తూ, ప్రతి పక్షాలపై ఈడీ, సిబిఐ దాడులు చేస్తూ, రాజకీయాన్ని అబాసు పాలు చేశారు. బిజేపి ప్రజల్లో లేకుండా చేసుకున్నారు. దక్షిణాదిన వున్న ఆ ఒక్క రాష్ట్రంనుంచి తరిమేసేలా చేసుకున్నారు. అక్రమంగా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంపాటు సంక్షేమాన్ని విస్మరించిని బిజేపికి కర్నాకట ప్రజలు బాగానే బుద్ది చెప్పారు. 

 ఇక బిజేపికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యే తరుణం త్వరలోనే వుంది.

 అది బిఆర్‌ఎస్‌ వల్లనే సాధ్యమౌతుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వమే దేశానికి కావాల్సివస్తుంది. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ మహారాష్ట్రంలో దూసుకుపోతోంది. పైగా మహరాష్ట్రంలో సాగుతున్న బిజేపి అనైతిక పాలనపై సుప్రింకోర్టు కూడా అక్షింతలు వేసింది. ప్రజా నిర్ణయాన్ని కాదని, జనం తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూలదోసి, పార్టీని చీల్చి బిజేపి అధికారంలోకి రావడం అన్నది ప్రజాస్వామ్య విలువలకు విఘాతం. ఇప్పటికే సుప్రింకోర్టు అనేక విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే వుంది. అయినా బిజేపిలో మార్పు రాకపోతే మళ్లీ బిజేపి ఎక్కడినుంచి మొదలైంతో అక్కడికి వెళ్లాల్సి రావడం ఖాయం. ఏ రెండు సీట్లుతో ఇంత దాకా ఎదిగామని గొప్పలు చెప్పుకునే బిజేపి మళ్లీ ఆ సంఖ్యకు పడిపోవడం తధ్యం. ఇక తెలంగాణలో బిజేపిని ప్రజలు నమ్మే పరస్ధితి లేదు. ఎందుకంటే బిజేపికి అభివృద్ది అంటే పడదు. కేవలం రాజకీయం తప్ప మరో గోడు వుండదు. ప్రజల మధ్య ద్వేషభావాలు రుద్దడం తప్ప మరేం చేయలేదు. అందుకే బిజేపికి దక్షినాదిన ఉనికి లేదు. ఉత్తరాధిన వున్న ఉనికి పతనం కాకతప్పదు. ప్రజామోదం కోల్పోక తప్పదు. అమ్మడాలు, కూల్చడాలు తప్ప నిర్మించడాలు తెలియని బిజేపికి ఎప్పటికీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన రాదు. ప్రజలు ఒకటికి రెండుసార్లు అవకాశం కల్పించారు. నమ్మారు. కాని ప్రజల నమ్మకాన్ని బిజేపి వమ్ము చేసింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి మోడీ మన్‌కీ బాత్‌ తప్ప, జన్‌కీ బాత్‌ గురించి పట్టించుకోవడని తేలింది. జనం ఆశలు నెరవేర్చని పాలకులను ప్రజలు గద్దెదింపుతారని తెలిసినా, మొండి రాజకీయాలు మతాన్ని అడ్డంపెట్టుకొని చేస్తామంటే ప్రజలు సహించరు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజేపికి పరాభవం తప్పదు. దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో కూడా బిజేపికి భంగపాటు తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!