కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
కల్వల గ్రామానికి చెందిన గొల్ల కురుమ యాదవులు,కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మహబూబాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందనీ ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగాల పిచ్చయ్య తెలిపారు.ఈ సందర్భంగా వారికి ఎమ్మేల్యే బి ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మోడం రవీందర్,మండల కార్యవర్గ సభ్యుడు ఏదునూరి శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కుదురుపాక ఉపేందర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.బి ఆర్ ఎస్ లో చేరిన వారిలో మార్గం యాదగిరి తాడబోయిన,కొమురయ్య బిజెపి పార్టీకి చెందిన గొడ్డేటి రాము చిలుకూరి నరసయ్య,యేసు,దాసరి కొమురమ్మ మొత్తం 40 కుటుంబాలు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం కావడం జరిగిందనీ తెలిపారు.