బహుజన రాజ్యాధికార యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జతంతి వేడుకలు

నర్సంపేట,

తెలంగాణ తొలి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన వీరుడు శ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పాపన్న గౌడ్ 373 జయంతి సందర్బంగా నర్సంపేట గౌడ సంఘం పట్టణ కమిటీ అధ్వర్యంలో పట్టణంలోని పాఖాల సెంటర్ లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన చేసిన పోరాట పలితాలను గుర్తుకు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సమాజం మొత్తం గర్వించదగ్గ భాహుజన ముద్దుబిడ్డ ఆనాడే అరాచారాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని తెలిపారు.పోరాట యోధుడు సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జీవిత స్ఫూర్తిని ఆదర్శనంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా జరపడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.నర్సంపేట పట్టణంలో రూ.1 కోటి రూపాయలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేశామని నేడు నర్సంపేట పట్టణ గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అలాగే మరో రూ.50 లక్షలను కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అదనంగా మంజూరు చేపిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అందింస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో నియోజకవర్గంలోని గౌడ కులస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగేళ్లి వెంకటనారాయణ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు గిరగాని సాంబయ్య గౌడ్,పట్టణ కమిటీ భాద్యులు బొమ్మగాని కుమార్ గౌడ్ తాళ్ళపెల్లి కుమార్ గౌడ్ తాళ్శపెల్లి చంద్రమౌళి గౌడ్ కోల వెంకన్న గౌడ్ తండ శ్రీధర్ గౌడ్ మాచర్ల ఐలుమల్లుగౌడ్, తాల్లపెల్లి చంద్రమౌళి గౌడ్, పంజాల రాజు గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్,చుక్క అనిల్ గౌడ్, గౌడ కౌన్సిలర్లు శీలం రాంబాబు గౌడ్,వేముల సాంబయ్య గౌడ్, గంప సునీత రఘునాథ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!