బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి

ఎస్.ఎఫ్.ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి డిమాండ్.

నేటిధాత్రి చేర్యాల..

చేర్యాల : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చేర్యాల బస్ డిపో ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల నుండి నేటి వరకు 3 సార్లు బస్ ఛార్జీలు పెంచడం సరైనది కాదన్నారు.. మొత్తం బస్ చార్జీలు, బస్ పాస్ ఛార్జీలు 150 శాతం పెంచారన్నారు. డీజిల్ సెస్ పేరుతో 5 రూపాయలు, జనరల్ బస్ పాస్ ఛార్జీలు 165 నుండి 400, 5 కిలోమీటర్ల వ్యవధి దూరం గల విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు 115 నుండి 150 వరకు, 35 కిలోమీటర్ల వ్యవధి దూరం గల విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు 335 నుండి 550 రూపాయల వరకు పెంచారన్నారు. ఈ పెంచిన ఛార్జీలతో దాదాపు బస్ పాస్ ఛార్జీలు గతంకన్నా రెట్టింయినట్లు ఉందన్నారు. ఈ స్థాయిలో బస్ పాస్ ఛార్జీల పెంపు చదువుకునే గ్రామీణ ప్రాంత బలహీన వర్గాల విద్యార్థుల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ పెంపు చర్యలను ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరి భరత్ , నాయకులు విక్రం,శివ ,తదితరులు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!