సిద్దిపేట డిపో ఎదుట PDSU-PYL సంఘాల ధర్నా..!!
సామాన్యులకు రవాణ మార్గమైన ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడం సిగ్గు చేటని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం,ప్రగతిశీల యువజన సంఘాలు ఆరోపించాయి.
శనివారం చార్జీల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సిద్దిపేట బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం డిపో అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పి.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ వేలాదిమంది గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు చదువుకునేందుకు వివిధ ప్రాంతాలకు వెళుతున్నారని ,పెరిగిన చార్జీల భారం విద్యార్థుల బస్ పాసుల పై పడిందని దీనితో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.గతంలో ఉన్న బస్ పాసుల ధరలకే చాలామంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారని గుర్తుచేశారు.
165 రూపాయల ఉన్న బస్ పశ్ ధర ఇప్పుడు 450 కి పెరిగిందని అలాగే 200 పాస్600 కి,245 పాస్900 కి,280 ఉన్న పాస్ ధర 1150 కి అమాంతం పెరిగిపోయిందని తెలిపారు.
ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకుడు అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలకు లాభ నష్టాలతో సంభందం ఏం ఉన్నదని ప్రశ్నించారు. తక్షణమే పెంచిన బస్ చార్జీల ధరలను తాగించి,విద్యార్థులకు ఉచిత బస్ పాసులను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.డీ.ఎస్.యు,పివైఎల్ నేతలు విద్యానాథ్,ఆగస్తీన్,తిరుపతి,సందీప్,జనార్దన్,స్వామి,కుమార్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు