బడుగులను తొక్కేయడమే రెడ్డి రాజకీయమా?

కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయం` గౌడ్‌లకు రాజకీయ సంకటం!

`కోమటి రెడ్డి సోదరులు ఎంచుకున్న మార్గం అదేనా?

`బడుగులను ఎదకుండా చేయడమే బ్రాండ్‌ ఇమేజా?

`పేదలకు అన్నం పెట్టినట్లు చెప్పి, నాయకులకు సున్నం పెట్టడం ఏం నీతి?

`ఎదురుగా ఎంత మంది రెడ్డి నేతలున్నా సరే…బడుగులు లీడర్లు కావొద్దా?

`నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది గౌడ నేతలకు భవిష్యత్తు లేకుండా చేశారో గుర్తుందా?

`ఒక్కసారి రెడ్డి నాయకుడైతే మర్రి చెట్టు లా పాతుకుపోవాల్సిందేనా?

`వాళ్ల కింద బడుగులు బక్కచిక్కి పోవాల్సిందేనా?

`తెలంగాణ లో ఎంతకాలం ఆధిపత్య రాజకీయాలు?

నీతులు చెప్పడం గొప్ప కాదు..ఆచరించి చూపడం గొప్ప. కుడిచేత్తో పెట్టి, ఎడమచేత్తో మొత్తే నాయకులు చాలా మంది రాజకీయాల్లో కనిపిస్తారు. అందులో తెలంగాణలో నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులు కనిస్తారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. సహజంగా రాజకీయాల్లో ఒక్కసారి రెడ్డి రాజకీయం ఆధిపత్యం మొదలైతే అక్కడ ఇతర బడుగుల సామాజిక వర్గాలు బలపడడం అన్నది జరిగే ముచ్చటే లేదు! అలా బాగు పడ్డ సందర్భాలులేవు. ఇలా వారి దారిని రహదారి చేసుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లాకుచెందిన ఎంతో మంది బలమైన బిసి నేతలను కూడా ఎదుకుండా చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ పట్టువదలని విక్రమర్కుల్లా పని చేశారని తెలుస్తోంది. ఎప్పుడైతే డీ లిమిటేషన్‌లో అప్పటి ఉమ్మడి జిల్లాలకే పరమితమైన పార్లమెంటు స్ధానాల్లో కొన్ని మార్పులు జరగడం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు బాగానే కలిసి వచ్చింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ హయాం నుంచి వారు ఆడంది ఆటపాడిరది పాటగా సాగుతూ వస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో వారు జనగామ నియోజవర్గంలో పొన్నాల లక్ష్మయ్యను ఓడిరచాలని శతవిధాల ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలోనే పొన్నాలకు ఓట్లకు వచ్చిన ఓట్లకంటే భువనగిరి ఎంపిగా రాజగోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్లు ఎక్కువ. పెద్దఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. అంటే పరోక్షంగా పొన్నాల హావా తగ్గించాలని చూశారు. కాని ఆయన తక్కువ మెజార్టీతో బైపటడ్డారు. తర్వాత కూడా అటు కోమటిరెడ్డి సోదరులు, పొన్నాల మధ్య ఎప్పుడూ కోల్డ్‌ వార్‌ సాగుతూనే వుండేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆలేరు నియోజకవర్గం ఒకప్పుడు బడుగులకు పెద్ద పీట వేస్తూ వచ్చేది. అక్కడ ఐదుసార్లు వరసగా మోత్కుపల్లి నర్సింహులు గెలుస్తూ వచ్చారు. ఆయనను కూడా సాధ్యమైంత మేర తెలుగుదేశంలో నెగలకుండా చేస్తూ వచ్చిన వారిలో ఎలిమినేటి మాధవరెడ్డితోపాటు, ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి కూడా ఆలేరు రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపుతూ వచ్చారు. ఇంతలో వచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఆలేరు నుంచి నగేష్‌ రెండుసార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో బిక్షమయ్య గౌడ్‌ గెలిచారు. ఆయన రాజకీయం ఒక్కసారిగా దూసుకొచ్చిన నాయకుడు. ఆయనను కూడా రాజకీయంగా తొక్కేయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ కీలకపాత్ర పోషించారనే ప్రచారం విసృతంగా సాగుతోంది. మొత్తంగా కోమటిరెడ్డి సోదరులు ఏ పార్టీ నాయకులైనా సరే గౌడ్‌ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అణచివేసే ఎత్తుగడలే ఎక్కువ వేశారన్నది స్పష్టమౌతోంది. తెలంగాణ వస్తుంది… జిల్లాల విభజన జరుగుతుందన్న ఆలోచన అప్పట్లో ఎవరికీ లేదు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నంత కాలం నల్లగొండ జిల్లా రాజకీయాలు తమ కనుసన్నల్లోనే నడవాలని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బలంగా బావించారు. దాని పర్యవససానమే గౌడ నేతలను రాజకీయంగా ఎదకుండా చేశారనేది ప్రచారం జరుగుతోంది. 

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమికపోషించి, వైద్యుల జేఏసి ద్వారా తెలంగాణ ఉద్యమానికి బూరనర్సయ్య గౌడ్‌ ఎంతో తోడ్పాడు పడ్డాడు. బూర నర్సయ్య గౌడ్‌ను రాజకీయంగా ఎదకుండా చేయడంతో పాటు, మధుయాష్కీగౌడ్‌ను భువనగిరి వైపు చూడకుండా ఏక కాలంలో ఇద్దరు నాయకులు రాజకీయ జీవితం సమాధి చేయడంలో కోమటి రెడ్డి సోదరులు సక్సెస్‌ అయ్యారు. 2014 ఎన్నికల్లో భువనగిరి నియోజక వర్గం నుంచి సమారు 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచిన బూర నర్సయ్యగౌడ్‌ను ఎలాగైనా ఓడిరచాలని కోమటిరెడ్డి బ్రదర్స్‌ చేసిన రాకీయం కళ్లమందే కనిపిస్తోంది. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డితో సంప్రదింపులు జరిగి, బూరనర్సయ్యగౌడ్‌ను ఓడిరచారనేది ప్రధాన అరోపణ. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు పెద్దఎత్తున హల్‌ చల్‌ చేస్తోంది. భువనగిరిలో బూరనర్సయ్య గౌడ్‌ను ఓడిరచడంలో ఫైళ్ల శేఖర్‌రెడ్డి చేసిన సహాకారానికి రాజగోపాల్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపనట్లు వున్న వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇలా బూర నర్సయ్య గౌడ్‌ రాజకీయాన్ని తుంచేయడంలో కోమటి రెడ్డి సోదరులు చేసిన రాజకీయం గౌడ సామాజికవర్గంలో ఒక అలజడిని సృష్టించింది. అంతే కాకుండా నిజామాబాద్‌ మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ గత ఎన్నికల ముందు భువనగిరి నుంచి పోటీ చేయాలని ఎంతో ఆశించారు. ఆయనను ఎట్టి పరిస్ధితుల్లోనూ భవనగిరి రాకుండా చేసి, ఎమ్మెల్యేగా ఓడిపోయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టి భువనగిరి నుంచి పోటీ చేశారు. నల్లగొండ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని అంతకు ముందు ఎమ్మెల్యే ఎన్నికల్లో తేలిపోయింది. దాంతో భువనగిరి నియోజకవర్గం ఎంచుకొని మధుయాష్కీ గౌడ్‌ను భువనగిరికి దూరం చేశాడు. జనగామ నియోజవర్గంలో రుద్రమదేవీ మాక్స్‌ సొసైటీ అనే దానికోసం ఓ భవనం ఏర్పాటు చేసి, అక్కడే ఓ అనాధాశ్రమం ఏర్పాటు చేసి, అక్కడి రాజకీయాలను కూడా పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ గుప్పిట్లోకి తీసుకొన్నారు. దాన్ని పదేపదే ప్రచారం చేసుకోవడమే కాకుండా, పొన్నాల లాంటి నాయకుడిని కూడా రాజకీయంగా అణచివేయడంలో కృతకృతులయ్యారు. 

ఇదిలా వుంటే తాముండే నల్లగొండ నియోజకవర్గంలో బడుగులు ముఖ్యంగా గౌడ సామాజిక వర్గ నేతలు ఎదకుండా చేశారంటూ కోమటిరెడ్డి సోదరులు రాజకీయ తోడేళ్లు అంటూ పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం హయాంలో నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలలో పెద్దఎత్తున గౌడ సామాజిక వర్గం ఎదిగింది. రాజకీయంగా బలమైన పునాదులు పడ్డాయి. కాని వాటిని కూకటివేళ్లతో పెకిలించి, గౌడ నాయకత్వాలను ఎక్కడిక్కడ తుంచేయడంతో కోమటిరెడ్డి సోదరులు నిమగ్నమైన బడుగులు నాయకత్వాలను నాశనం చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా సుంకర మల్లేష్‌ గౌడ్‌ అనే నాయకుడిని చెప్పుతో కొట్టించి అవమానించి ఆయన రాజకీయ జీవితం సమాధి చేశారని చెప్పుకుంటున్నారు. నల్లగొండ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన పుల్లెంల వెంకటనారాయణ గౌడ్‌ రాజకీయంగా అంతకు మించి ఎదకుండా చేయడంలో విజయం సాధించారు. ఆయనను రాజకీయాలకు దూరం చేశారు. వంగాల స్వామీ గౌడ్‌ అనే నాయకుడికి రాజకీయం లేకుండా చేశారు. నకిరేకల్‌లో చెరుకు సుధాకర్‌ గౌడ్‌ రాజకీయంగా ఎదకుండా చేయడంలో కూడా కోమటిరెడ్డి సోదరులు సక్సెస్‌ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్‌ది ప్రత్యేకపాత్ర. ఆయన చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమంలో ఎంతో విలువైంది. ఏకంగా పిడి ఆక్ట్‌ కింద అరెస్టైన ఏకైక నేత. సుమారు రెండు సంవత్సరాలు వరంగల్‌ జైలులో జీవితం గడిపారు. ఆయన ఉన్నత విద్యావంతుడు. పేదల వైద్యుడు కూడా. అలాంటి నాయకుడిని రాజకీయంగా ఎదకుండా చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్‌ చేరడాన్ని, ఆయను చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోవడంలేదు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా కూడా ఆపాదించుకోవచ్చు. నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యను ప్రోత్సహించాల్సివచ్చినా, ఆయన ఎమ్మెల్యే కాగానే కోమటిరెడ్డి బ్రదర్స కబంద హస్తాలనుంచి ఎంతో తెలివిగా తప్పించుకున్నారు. సొంత నాయకత్వం మీద దృష్టిపెట్టుకున్నారు. ఆయన టిఆర్‌ఎస్‌ చేరిన సమయంలో ఆయనను కూడా పెద్దఎత్తున బద్‌నాం చేశారు. రాజకీయంగా భవిష్యత్తు నిచ్చన తమకు అన్యాయంచేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలకు చిరుమర్తి లింగయ్య చేసింది కరక్టే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. తిప్పర్తి జడ్పీటీసి తుండు సైదులు గౌడ్‌ తమ కనుసన్నల్లోనుంచి లేకుండా ఎదుగుతున్నాడని ఆక్రోశించి, ఆయన రాజకీయ జీవితాన్ని చిదిమేశారు. ఆయనపై కేసులు నమోదు చేయించి అక్రమ కేసుల్లో ఇరికించారని తెలుస్తోంది. భవనగిరిలో పచ్చిమట్ల శివరాజ్‌ గౌడ్‌ ను రాజకీయంగా తొక్కేశారు. సూర్యాపేటలో ధనుంజయ్‌ గౌడ్‌ను ఎదగకుండా చేశారు. నల్లగొండలో మల్లయ్యను రాజకీయంగా కోలుకోకుండా చేశారు. మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌ పరిస్ధితి కూడా అలాగే చేశారని ఆరోపణలున్నాయి. గౌడ్‌ నాయకులను తొక్కుకుంటూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎదిగారనేది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఈసారి గౌడ సామాజిక వర్గమంతా ఏకమైన కోమటిరెడ్డి సోదరుల రాజకీయంతో ఆడుకోవాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!