బడాయి మాటల బిజేపి!?

`కోమటిరెడ్డి కోతలు…అబద్దాల మూటలు? 

“మూడేళ్ల కింద ముచ్చట్లు చెప్పి…కాంట్రాక్టు కోసం మునుగోడును ముంచి!?

`మునుగోడును అద్దం చేస్తానన్నావు….`అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అన్నావు…

` తెలంగాణ లో మునుగోడు ముందు వరుసలో నిలుపుతానన్నావు.

` అరవై ఏళ్లలో చేయనిది ఐదేళ్లలో చేస్తానన్నావు…`మూడేళ్లకు చేతులెత్తేశావు…

`మునుగోడులోనే ఇల్లు కట్టుకొని వుంటా అన్నావు?

`ఇప్పుడూ మళ్ళీ అదే చెబుతున్నావు?

`ఆస్తులన్నీ అమ్మైనా సరే ప్రజలకు సేవ చేస్తానన్నావు?

`ప్రజల్లో డబుల్‌ బెడ్‌ రూంలో వుంటానన్నావు.

18వేల ప్రాజెక్టు కోసం రాజీనామా చేశావు?

`మూడేళ్ల నాడు కాంగ్రెస్‌ కు తిరుగులేదన్నావు?

` కాంగ్రెస్‌ ను ముంచి కమలం అందుకున్నావు?

`మునుగోడులో ఇంటింటికీ పెద్దకొడుకౌతానన్నావు?

`మరి ఎంత మందిని ఆదుకున్నావు?

`ఇప్పుడేమో మూడు వేల పెన్షనంటున్నావు?

`ఇప్పుడెట్లిస్తావు…మళ్ళీ నిలబడి ఎవరినుద్దరిస్తావు?

`దుబ్బాకలో నమ్మించారు…`హుజూరాబాద్‌ లో మాయ చేశారు…

`ఇప్పుడైతే నోటికొచ్చిన అబద్దాలన్నీ చెబుతున్నారు…

బడాయి మాటల బిజేపికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోతలు భలే తోడయ్యాయి…అబద్దాల మూటలు పేరుకుపోతున్నాయి. గత మూడేళ్ల కితం చెప్పిన మాటలు మరిపించేందుకు, కాంట్రాక్టు ఇచ్చిన వారిని మెప్పించేందుకు కొత్త కొత్త కథలు అల్లుతూ…అప్పటికప్పుడు చెబుతున్నాడు. పాతవి మర్చిపోయేలా చేస్తున్నాడు. ఒక్కసారి గతంలో మునుగోడులో 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే నాయకుడంటే ఇలా వుండాలి? అనిపిస్తుంది. కాని ఇప్పుడు అవే మాటలు వింటే నాయకుంటే ఇలా వుంటారా? అనిపిస్తుంది. అంత తేడా వుంటుంది. కాలమే మారింది… నాయకుడు మారలేదు…ఆయన చెప్పిన అబద్దాలు మారలేదు…కొత్తవి మరిన్ని పుట్టకొస్తున్నాయే…గాని నిజాలు ఒక్కటి కూడా రావడం లేదు…నిజాలు చెప్పడానికి ఆయనకు ధైర్యం కూడా లేదు… ఒక రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి మీడియాతో మాట్లాడినట్లు సర్కిలేట్‌ అవుతున్న వార్తలోనైనా నిజాలున్నాయి…కాని రాజగోపాల్‌ చెప్పే మాటల్లో ఒక్కటీ నిజం లేకుండాపోతోందంటున్నారు. ఆమె కొన్ని నిజాలు చెప్పినట్లుంది. ప్రజలకు తమ మీద కోపం వుందన్న సంగతి స్పష్టం చేసింది. కాని రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఆకాశంలో పందిరేసినంత పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాడు..అందులో ఓ ఆణిముత్యమటువంటి మాట మాత్రం కడు విచిత్రంగా వుంది. ఫ్రధాని మోడీని ఒప్పించి రెండు వేలు వున్న పెన్షన్‌ను రూ.3వేలు చేయిస్తాడట…మునుగోడులో అమలు చేస్తాడటా…అందిస్తాడట? ఇది నమ్మశక్యంగా వుందా? గుజారాత్‌ రాష్ట్రంలో సీనియర్‌ సిటిజన్స్‌కి ఇస్తున్న ఫించన్‌ కేవలం రూ.600 మాత్రమే. కాని తెలంగాణలో వస్తున్న ఫెన్షన్‌ రూ.2000. మరి అక్కడికి ఇక్కడికి తేడా రూ.1400. ఈ లోటును బిజేపి పాలించే రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు. కాని మునుగోడులో రూ.3వేల ఫెన్షన్‌ ఇస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పే మాట నమ్మశక్యమైందేనా? సేమ్‌…ఇలాగే గత 2018 ఎన్నికల్లోనూ రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటలు వింటే ఔరా? అని ముక్కున వేలేసుకోవాల్సిందే…వాటిని ఒకసారి పరిశీలిద్దాం… మునుగోడులో 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనను గెలిపిస్తే మునుగోడును అద్దం చేసినట్లు చేస్తానన్నాడు.

 

మునుగోడు నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్తే అక్కడ మునుగోడునుంచి వచ్చారని తెలిస్తే మన గురించి అడిగేలా చేస్తా…మునుగోడును కరంటు వెలుగుల్లో ముంచేస్తా…నాలుగు లైన్ల రోడ్లుతో మునుగోడును మంచి మంచి పట్టణాలను తలదన్నేలా చేసి చూపిస్తా…ఉదయ సముద్రం పూర్తి చేస్తా…? మునుగోడులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయిస్తా….ఇలాంటి వరాలతోపాటు మండలాలకు ఆయన ఇచ్చిన వరాలు చూస్తే మతి పోవాల్సిందే… నేనిక్కడే వుంటా…మీలో ఒకడిగా వుంటా…మునుగోడులో ప్రతి ఇంటికి పెద్ద కొడుకునౌతా…సేవ చేస్తా…చెల్లెమ్మలకు అన్ననౌతా…అంటూ అనేకం చెప్పాడు…తన కుమారుడిని కూడా తీసుకొచ్చి ఆస్ధులన్నీ పోయినా ఫరవాలేదు..మునుగోడు బాగు చేస్తా…బంగారుతునక చేస్తా…ఇక ఇక్కడే మకాంపెడతా…ఇక్కడో ఓ ప్లాట్‌ తీసుకొని ఇళ్లు కట్టుకొని మీ మధ్యే వుంటా…ఇరవై నాలుగు గంటలు అందుబాటులో వుంటా..ఒక వేళ ముఖ్యమంత్రి కేసిఆర్‌ తనను, తన వ్యాపారాన్ని అణిచివేయాలనిచూస్తే, ఆస్ధులన్నీ పోతే మీ మధ్యే డబుల్‌బెడ్‌ రూంలో వుంటా…మీకోసమే బతుకుతా… నాకంటూ పెద్దగా కోరికలు లేవు..వ్యాపారం నేను చూసుకోవ డం లేదు… మీకోసమే నా జీవితం…మీ కోసమే ఈ రాజకీయం అంటూ ప్రజల నమ్మించాల్సినంత నమ్మించాడు..ఆడకూడని అబద్దాలన్నీ ఆడాడు..సాధ్యం కాని హమీలన్నీ ఇచ్చాడు..గెలిచాడు..మళ్లీ రాజకీయ భవిష్యత్తు కష్టమని తెలిసి, ఎన్నికల దగ్గర్లో వుండగా కొత్త పల్లవి అందుకున్నాడు…పార్టీ మారినా రాజీనామా చేశానంటూ…మళ్లీ గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు…

సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్‌, కరీంనగర్‌లను మించి మునుగోడును అభివృద్ది చేస్తానన్నాడు. కాని ఏ ఒక్క పని ముట్టుకోలేదు. పూర్తి చేయలేదు. తన సొంత నిధులైనా ఖర్చుచేస్తా? అన్నాడు. ఒక్క పైసా తీసింది లేదు. అభివృద్ధి చేసింది లేదు…ఆస్ధులు పెంచుకునేందుకు కొత్త కొత్త కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రూ.18వేల కోట్ల ప్రాజెక్టు దక్కిందని ఆయనే స్యయంగా చెబుతున్నాడు. కాని అది నాది కాదని బుకాయిస్తున్నాడు…! ఒకనాడు మేం పేదవాళ్లమన్నాడు…మాది చిన్న చిన్న వ్యాపారం అన్నాడు…అక్కడా ఇక్కడా అప్పులు చేసి వ్యాపారాలు సాగిస్తామన్నాడు…ఆయన కంపనీల మీద ఈడీ దాడులు అన్న వార్త వినగానే బిజేపికి దగ్గరయ్యాడు…కాంగ్రెస్‌కు దూరమయ్యాడు…ఇక బిజేపిలో తనదే రాజ్యమన్నాడు..ఆఖరుకు బిజేపిలో తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినంటూ కూడా కొంత కాలం కోతలు కోశాడు…! 2018 ఎన్నికల సమయంలో టిక్కెట్టు కోసం నానా తంటాలు పడ్డాడు…కాంగ్రెస్‌ కనికరించి టిక్కెట్టు ఇస్తే మునుగోడులో కాంగ్రెస్‌ శ్రేణులు గెలిపిస్తే గెలిచాడు… ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ లేదన్నాడు…బిజేపికి భవిష్యత్తే లేదన్నాడు…! 2018లో గెలవగానే ప్లేటు పిరాయించాడు..కాంగ్రెస్‌ పార్టీ పని ఖతమైందన్నాడు…భవిష్యత్తు రాజకీయమంతా బిజేపిదే అంటూ కొత్త రాగం అందుకున్నాడు..అప్పటినుంచే తన కొడుకు భవిష్యత్తుకోసం పెద్ద ప్రాజెక్టుకు ఎసరు పెట్టాడు…మేం పేదవాళ్లమని చెప్పి, రూ.7 కోట్లతో కారు కొని, నాది కాదన్నాడు…ఇప్పుడు మాది కార్లలో తిరగాల్సిన ఫ్యామిలీ కాదు…! అడుగు తీసి అడుగు బైటపెడితే హెలీకాప్టర్లలో తిరగాల్సిన వాళ్లమంటున్నాడు…! ఒక నాయకుడిలో ఇన్ని వేరియేషన్లా..? అంటే ప్రజలు నమ్మినంత కాలం రాజకీయాలను వ్యాపారాలకు ముడిపెట్టి సంపాదిస్తూనే వుంటారు…చేతికంటిన మెతుకులు విధిలిస్తూ దాన ధర్మాలు చేస్తున్నామంటారు…అదే ప్రజాసేవ అని గొప్పలు చెప్పుకుంటారు…అదే కోమటిరెడ్డి బ్రదర్స్‌ బ్రాండ్‌ అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. 

మునుగోడులో ప్రతి ఇంటికి పెద్ద కొడుకునన్నాడు..మూడేళ్లనాడు కాంగ్రెస్‌ తనకు రాజకీయ బిక్ష పెట్టిందన్నాడు…కాంగ్రెస్‌కు హండిచ్చి, కమలం పంచన చేరారు…పువ్వును చూసి మురిసిపోతున్నాడు… రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినందుకు బిజేపికి రుణం తీర్చుకునే ప్రయత్నంలో వున్నాడు…మునుగోడు గోడును వదిలేసి, తన గోడును చెప్పుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నాడు…ప్రజలను అడుక్కునేలా చేస్తున్నాడు…! రాజకీయాలలో నైతికత అన్నది తామరాకు మీద నీటిబొట్టు లాంటిదని నిరూపిస్తున్నాడు… మునుగోడును చూసి మురిసిపోవాలన్నంత అందంగా తీర్చిదిద్దుతా అన్న మాటలు ఏనాడో వదిలేశాడు….తనకు నిధులివ్వకుండా ప్రభుత్వం మునుగోడుకు న్యాయం చేయలేకపోతున్నానని చేతులెత్తేశాడు… మరి మళ్లీ ప్రభుత్వం ఎలా నిధులిస్తుంది…? తెలంగాణలో అప్పుడు ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఇస్తుందన్నది తెలిసుకోలేనంత అమాయకులా ప్రజలు…! మోసం ఒకసారి చేయొచ్చు..రెండుసార్లు చేయొచ్చు…పదేపదే కుదరదు..! ఎందుకంటే దుబ్బాకలో రఘునందర్‌ రావు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ, మునుగోడులో ప్రజలు నిలదీస్తున్నారంటే ప్రజలు ఎంత చైతన్యవంతులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…దుబ్బాకలో ఇంటికో బండి,రెండు బండెడ్లు ఇస్తానన్నావు…ఇచ్చావా? అని ప్రజలు అడుగుతుంటే రఘునందన్‌ నీళ్లు నములుతున్నాడు…మళ్లీ ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని ఇప్పటినుంచే కంగారు పడుతున్నాడు…జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి బిజేపి ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కాదు…ఫలితాల నాడే చేతులేత్తేసిన బిజేపిని ఒక నమ్మకూడదని జనం నిర్ణయించుకున్నారు? ఇక ఇప్పుడు బిజేపి జూటా మాటలు ప్రజలు నమ్మే పరిస్దితి లేదు…మునుగోడులో అసలే నమ్మేలా లేరు…అంటున్నారు ప్రజలు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!