https://epaper.netidhatri.com/
ఉప్పల్ నియోజకవర్గం ప్రజలకు వరమే!
`బీఆర్‌ఎస్ ఉప్పల్ అభ్యర్థిగా ప్రకటనే తరువాయి.
`ఇప్పటికే ప్రజల్లో బండారి లక్ష్మారెడ్డి.
`ఒక్కసారి అవకాశం ఇస్తే ఐదేళ్లు సేవ చేస్తా!
`ప్రజల ఆదరణ తో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా!
https://epaper.netidhatri.com/
`నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తా!
`బిఎల్ ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు.
`ఎందరో విద్యార్థులకు ఫీజులు.
`ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు.
`ఏటా ప్రభుత్వ పాఠశాల మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.
`విద్యార్థులకు అవసరమైన వస్తువులు.
`యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు.
`అనేక మార్లు జాబ్ మేళాల నిర్వహణ.
`పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులు
`మహిళలకు కట్టు మిషన్లు.
`కరోనా సమయంలో విసృత సేవలు.
`ఎంతో మంది పేదలను ఆదుకున్న నాయకుడు.
`బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రజల ముందుకొస్తున్నారు.
హైదరబాద్,నేటిధాత్రి:
బండారి అంటే నిజంగా భండారే…లక్ష్మారెడ్డి అంటే నిజంగా లక్షణమైన నాయకుడే. తెలంగాణలో శివాలయాలలో భగవంతునికి సమర్పించే భండారి అంత స్వచ్చమైన నాయకుడు లక్ష్మారెడ్డి. శనివారం కూడా కాప్రాలో ఓ శివాలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందజేశారు. భాండాగారమంత గొప్ప మనసున్న నాయకుడు. మానవత్వం మూర్తీభవించిన మంచి మనసున్న నాయకుడు. ఇది ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలెవరిని అడిగినా ఇదే చెబుతారు. అంతగా ప్రజలకు దగ్గరైన నాయకుడు లక్ష్మారెడ్డి. అంతగా ప్రజలకు సేవ చేసే నాయకుడు మరొకరు లేరు.
మాటిస్తున్నా…నమ్మకంగా సేవ చేస్తా! అని ముందే చెప్పే నాయకులు చాలా తక్కువ.
ప్రజలంటే ఎంతో ప్రేమ. వారికి సేవ చేయడం ఎంతో ఇష్టం. అలా పేదలను అందుకోవడం కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలు మరింత విసృతంగా చేయాలన్న ఆలోచనే రాజకీయాలు. ప్రజా ప్రతినిధిగా మరింత ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుంది. అందుకే ఈసారి ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నారు. ఒక్కసారి నమ్మండి..ఐదేళ్లు విశ్వాసంగా పని చేస్తా అని బండారు లక్ష్మారెడ్డి ప్రజలకు మాట ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఇళ్లు, ఇళ్లు తరిగి ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. వారి నుంచి మద్దతు కూడ గడుతున్నారు.
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు బాగా సుపరిచితమైన పేరు బండారు లక్ష్మారెడ్డి రెడ్డి.
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు కొన్ని దశాబ్దాలుగా పేదలకు ఎల్లప్పుడూ అండగా వుంటూ వారిని అదుకుంటూ, మేలు చేస్తున్న నాయకుడు. ఎవరికి ఆపద వచ్చినా అన్నా అని అర్థరాత్రి తలుపు తట్టినా ఆదరించే మానవత్వం నిండి పెద్ద మనసున్న నాయకుడు బండారి లక్ష్మారెడ్డి. తన పేరు మీద బిఎల్‌ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని, ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలెవరు సాయం కోరి వచ్చినా లేదనకుండా సాయపడతాడు. తన వద్దకు వచ్చిన వారికి కాదనకుండా సాయపడతాడు. ఇక ఉప్పల్ నియోజకవర్గ వాసులకు అనేక సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉప్పల్ నుంచి బరిలో నిలుస్తున్నాడు. ఈ నెల 25న తొలి బిఆర్‌ఎస్ జాబితా విడుదల కానున్నది. మొదటి లిస్ట్ లోనే బండారు లక్ష్మారెడ్డి పేరు ప్రకటన జరగనున్నది. బిఆర్‌ఎస్ నుంచి టికెట్ ఈసారి లక్ష్మారెడ్డి కే అనే ప్రచారం విసృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్ కు అత్యంత సన్నిహితమైన నాయకులలొ లక్ష్మారెడ్డి ఒకరు. ఈ మధ్యే ముఖ్యమంత్రి కేసిఆర్ ను ప్రగతి భవన్ వెళ్లి లక్ష్మారెడ్డి కలవడం జరిగింది. టికెట్ ఖరారు చేస్తున్నట్లు, ప్రజల్లోకి వెళ్లండి అని ముఖ్యమంత్రి కేసిఆర్ సూచించినట్లు సమాచారం. అందుకే కొంత కాలంగా లక్ష్మారెడ్డి బస్తీ పర్యటన విసృతంగా సాగిస్తున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అది వ్యక్తి గత సమస్యలైనా, కాలనీ సమస్యలైనా సరే తీర్చుతున్నాడు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగానే తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతగా సేవా కార్యక్రమాలు చేస్తున్న లక్ష్మారెడ్డి , ప్రజా పతినిధి అయితే ఎంత సేవ చేయగలరో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో ప్రజలకు ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. రెండు సంవత్సరాల కరోనా కాలం నిరంతరంగా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదల ఆకలి దప్పులు తీర్చారు. అనారోగ్యం పాలై, ఆదుకొమ్మంటే ఆసుపత్రుల ఫీజులు చెల్లించాడు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో తన సొంత నిధులు వెచ్చించారు. విద్యార్థులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సులు, ప్లేట్లు, గ్లాసులు అందించారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. పాఠశాలలో నిర్వహించే వివిధ రకాల పోటీలో నెగ్గిన వారికి బహుమతులు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలకు లెక్కే లేదు. అంతగా ప్రజల కోసం ఆలోచించే లక్ష్మారెడ్డి, గత కొంత కాలంగా నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్లో ప్రతి కాలనీ, ప్రతిబస్తీ లలో ప్రజలతో మమేకమౌతున్నారు. అందరి అభిమానాన్ని అందుకుంటున్న ఏకైక నాయకుడు లక్ష్మారెడ్డి. ఉప్పల్ ప్రజలు లక్ష్మారెడ్డికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజల అభిమానాన్ని అందుకుంటున్నారు. ఏ కాలనీకి వెళ్లినా, బస్తీలలో పాదయాత్ర నిర్వహిస్తున్నా మహిళలు లక్ష్మారెడ్డి కు స్వాగతం పలుకుతున్నారు. లక్ష్మారెడ్డి రెడ్డి పర్యటనల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉప్పల్ నియోజకవర్గ యువత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఎంతో మంది ఉప్పల్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఏకైక నాయకుడు లక్ష్మారెడ్డి. నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా అనేక సార్లు జాబ్ మేళాలు నిర్వహించారు. ఎంతో మందికి వాటిలో ఉద్యోగాలు పొందారు. ఆ కృతజ్ఞతతో లక్ష్మారెడ్డి వారి వారి కాలనీల పర్యటనకు వస్తున్నాడని తెలిసి యువత స్వాగతం పలుకుతున్నారు. వయసు పైబడిన వాళ్లు కూడా లక్ష్మారెడ్డి తోపాటు కాలనీల పర్యటన సాగిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో అనేక సార్లు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించారు. పేదలకు వైద్యం అందించారు. దాంతో లక్ష్మారెడ్డి బస్తీ బాటలో పెద్దవాళ్లు మహిళలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడుస్తున్నారు. కులమతాలు భేదాలకు తావు లేకుండా సాయం కోరి వచ్చిన వారందరికీ సాయం అందిస్తున్నారు. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి జరగనున్న ఎన్నికలలో తనను ఆదరించి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమై సేవ చేస్తానని మాట ఇస్తున్నారు. ఉప్పల్ లో బిఆర్‌ఎస్ పార్టీ బలంగా వుంది. బండారు లక్ష్మారెడ్డి ప్రజల గుండెల్లో వున్నారు. ప్రతిపక్షాలకు ఉప్పల్ లో తావులేదు. లక్ష్మారెడ్డి గెలుపుకు ఎదురులేదు.