ఉమ్మడీ వరంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ.
హనుమకొండ జిల్లా నేటిధాత్రి: ఉమ్మడి వరంగల్ దివ్యాంగుల జాక్ 90శాతం వికలాంగుడైన ఢిల్లీ
యూనివర్సిటీ ప్రొఫేసర్ సాయిబాబా విడుదలకై మహారాష్ట్ర హైకోర్టు తీర్పు నిలుపుదలకై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపి తదనంతరం
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు మెమోరాండం
సమర్పించారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య,వి-జాక్ సభ్యులు మరియు అంధనిరుద్యోగులైన
బి.ధనుంజయ్ ,ప్రవీణ్ కుమార్ ,మహేందర్ ,వీరన్న ,నర్సింహా,దిలీప్ ,మహేశ్వరి,అశ్విని,మౌనిక తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కన్వీనర్ నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా తదితరులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేనిన తీర్పుపై సుప్రీం కోర్టు “స్టే” ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్దమని ,వెంటనే బాంబే హైకోర్టు నిర్ధోషులుగా పేర్కొని ప్రకటించిన వారందరిని బేషరతుగా విడుదల చేయాలనీ ఉమ్మడి వరంగల్ దివ్యాంగుల జాక్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
న్యాయ వ్యవస్థ రాజ్యాంగ యంత్రాంగంలో భాగం కావడం వల్లనే కుట్రపూరితంగా కక్ష గట్టి ఆగమేఘాలపై తీర్పులు ఇవ్వడం అప్రజాస్వామికం అన్నారు.
ఇప్పటికైనా వెంటనే సుప్రీంకోర్టు మరోసారి నిష్పక్ష పాతంగా పరిశీలించి సాయిబాబాతో పాటు మిగతా నలుగురు ఆదివాసులను విడుదల చేసి
న్యాయ వ్యవస్థ పరువు కాపాడాలని ఉద్భోదించారు.