ప్రైవేటు ఆసుపత్రుల దొంగ దందాలు!?

`తమ వ్యాపారం తగ్గిందని అడ్డదారులు?

`ప్రభుత్వాసుపత్రులలో జరిగే చిన్న చిన్న సంఘటనలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేయడం?

`ప్రజలను భయాందోళనలకు గురిచేయడం?

`మళ్ళీ తమ వ్యాపారం సాగేందుకు ఎంచుకున్న అక్రమ మార్గం?

`ప్రసూతి వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రుల వైపే ప్రజలు.

`ప్రైవేటు వైద్యం వైపు చూడని గర్భిణీలు…

`సాధారణ కాన్పులు ప్రభుత్వాసుపత్రులలో…

`ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్లు ఎక్కువ?

`మోయలేని ఖర్చుతో పాటు సిజేరియన్‌ వల్ల అనారోగ్యం!

`నెలలపాటు విశ్రాంతి…దీర్ఘకాలిక సమస్యలు…

`ప్రభుత్వాసుపత్రులలో కేసిఆర్‌ కిట్‌…నగదు ప్రోత్సాహం… రవాణా సౌకర్యం…

`ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యానికి జనం కరువు…

`వ్యాపారం దివాళా…

`వైద్యసేవను ఏనాడో గాలికొదిలేసిన ప్రైవేటు ఆసుపత్రులు…

`ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో మళ్ళీ భయం కల్పించే కుట్రలు! 

`ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందితో సమస్యలు లీక్‌?

`ప్రభుత్వాసుపత్రులలో చిన్న చిన్న అసౌకర్యాలను విసృతంగా ప్రచారం చేయడం!

`ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని మరీ అసత్య ప్రచారం…

`ప్రభుత్వం దృష్టి సారిస్తేగాని ప్రైవేటు ఆసుపత్రుల దుష్ట పన్నాగం ఆగదు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రైవేటు ఆసుపత్రులు అక్రమ సంపాదనలకు ఎగబడుతున్నాయి. సేవ ఎప్పుడో గాలికి వదిశాయి. ప్రైవేటు ఆసుపత్రుల ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది. వ్యాపార సరళి పెరిగిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వీర్యం లక్ష్యంగా ప్రైవేటు ఆసుపత్రులు కుట్రలు పన్నుతున్నాయి. కుయుక్తులు విసురుతున్నాయి. అడ్డ దారులు తొక్కుతున్నాయి. దొంద దందాలకు తెరలేపుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులను అబాసు పాలు చేసేలా వదంతులు సృష్టించే ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల సౌకర్యాలపై లేని పోనివి ప్రచారం చేస్తున్నాయి. మొత్తం మీద మళ్లీ తమ ప్రైవేటు ఆసుపత్రులు కళకళలాడేందుకు అవసరమైన ఎత్తుగడలు వేస్తున్నాయి. కుతంతాలు పన్నుతున్నాయి. 

ఇంతకీ ఏం జరుగుతోంది:

తెలంగాణ రాష్ట్రం వచ్చాక, కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వైద్య వ్యవస్ధలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతూ వచ్చారు. సౌకర్యాల కల్పన జరిగింది. కొత్త భవనాలు కూడ అవసరమైన చోట నిర్మాణం జరిగింది. పెద్దఎత్తున డాక్టర్ల నియామకాలు జరిగాయి. పెద్దఎత్తున ఇతర సిబ్బంది నియామకాలు జరిపారు. ఆసుపత్రులకు అవసరమైన ఉపకరణాలు అందించారు. దాదాపు అన్ని రకాల టెస్టులు కూడా ప్రభుత్వాసుపత్రుల్లోనే చేపడుతున్నారు. వీటికి తోడు మాతా శిశు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెద్ద ఎత్తున పెంచే కార్యాక్రమం చేపట్టారు. ముఖ్యంగా కేసిఆర్‌ కిట్‌ ప్రకటించిన తర్వాత, నెల నెల టెస్టులు కూడా గర్భిణీలు ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయించుకుంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పరస్థితి వేరు. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ వైద్యం అన్నది ఎంతో అందుబాతటులోకి వచ్చింది.పేద ప్రజలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించడం జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు సాధారణ ప్రసూతి నిర్వహిస్తే ఎక్కువ బిల్లులు వసూలు చేయడం కుదరదు. దాంతో ఎక్కువగా సిజేరియన్లే చేస్తారు. డెలివరీకి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేసేవారు. బిడ్డ అడ్డం తిరిగిందని, ఉమ్మనీరు మింగారని, ఇలా రకరకాల కారణాలు చెబుతారు. ఆపరేషన్‌ చేయకపోతే తల్లి, బిడ్డలకు ప్రాణాలకే ప్రమాదమంటూ హెచ్చరిస్తుంటారు. దాంతో ఎవరైనా ప్రాణాలకన్నా డబ్బు ఎక్కువ కాదనుకోవడం సహజం. ఇదే ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా మారింది. కాని ఇటీవల కాలంలో కాన్పుల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చేవారే కరువౌతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెంచిన సౌకర్యాలతోపాటు, అక్కడ నార్మల్‌ డెలివరీలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో సురక్షితమైన డెలివరీలు చేపడుతున్నారు. రికార్టు స్ధాయిలో కాన్పులు చేస్తూ ప్రభుత్వ వైద్యాన్ని సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. దాంతో ప్రైవేటు ఆసుపత్రలకు గిరాకీ కరువైంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు సైతం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని తమ ఆసుపత్రులకు పంపించి అక్కడ సిజేరియన్‌ చేస్తుంటుంటారు. కాని ఇప్పుడు అది కుదడం లేదు. పరిస్దితి మారింది. 

హరీష్‌రావు ఆరోగ్యశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి నెలా మానిటరింగ్‌ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులపై డాక్టర్లు శ్రద్ద తీసుకునేలా చూస్తున్నారు. ఆరోగ్య భీమా వున్న వారు తప్ప పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ఆగిపోయింది. ఇది మింగుడు పడని ప్రైవేటు ఆసుపత్రులు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన సౌకర్యాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తే తప్ప, తిరిగి తమ ఆసుపత్రులు కోలుకోవని కొత్త నాటకానికి తెరతీస్తున్నారు. ఇందుకు ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తూ, అటు ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న వారు కూడా సహకరిస్తూ ప్రభుత్వాసుపత్రులపై దుష్ట ప్రచారం మొదలుపెడుతున్నారు. అందులో భాగంగా కొందరు వైద్య విద్యార్ధులకు కొంత ఆశ చూపించి, ప్రభుత్వాసుపత్రులలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలపై వీడియోలు చిత్రీకరించి, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఈ విషయం తెలిసి, ఇలా కూడా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరిస్తాయా? అని ముక్కున వేసేసుకునేలా చేస్తున్నారు.  

 సహజంగా తమ వ్యాపారం పెంచుకోవడం ఒక లక్షణం..

రెండోది ఎదుటి వారి వ్యాపారం దెబ్బతీయడం…ఇందులో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులైతే పోటీ ప్రపంచంలో ఇది కామన్‌ అనుకోవచ్చు. కాని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై అపోహలు సృష్టించి, ప్రజలను తమ ఆసుపత్రులకు ఆకర్షిచడం అన్నది వ్యవస్ధనే సవాలు చేయడమౌతుంది. వ్యవస్ధను నిర్వీర్యం చేయడమౌతుంది. ప్రభుత్వాన్నే ఎదిరించడం అవుతుంది. ప్రభుత్వ వ్యవస్ధలను కుప్పకూల్చడమౌతుంది. అది మొత్తం సమాజానికే సవాలుగా మారుతుంది. ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల ఇలాంటి దుష్ట కార్యక్రమాలకు తెరలేపిందని తెలుస్తోంది. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కూడ తెలుస్తోంది. 

ప్రతి వైద్యుడు ప్రజల ప్రాణాలు కాపాడేందుకే వైద్య అభ్యసిస్తుంటాడని అందరికీ తెలుసు.

 ప్రజలకు సేవ చేసేందుకే వైద్య వృత్తి చేపడతారు. వైద్యులుగా సమాజంలో ఒక గౌరవం వుంటుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. గుర్తింపు వస్తుంది. సంపాదన కూడా మిగతా వృత్తులకన్నా ఎక్కువగానే వుంటుంది. జీవితం సంతోషంగా గడుస్తుంది. చీకు చింతలు లేని జీవితం అనుభవించొచ్చు. అని ఆలోచించి తల్లిదండ్రులు ఆలోచించి, తమ పిల్లలను డాక్టర్లు కావాలని కోరుకుంటారు..వారికి అవసరమైన చదువుకు అందిస్తుంటారు. చదువుకునే విద్యార్దులు కూడా ఇంచుమించు ఇలాంటి ఆలోచనలతోనే డాక్టర్‌ చదవు చదువుకుంటారు. ఇంతవరకు బాగానే వుంటుంది. 

కాని వైద్యం మొదలుపెట్టే సమయంలోనే కాసుల కక్కుర్తి చాలా మంది డాక్టర్లకు మొదలౌతుందని అంటున్నారు.

 వైద్య వృత్తి మొదలుపెట్టేన నాటినుంచే వ్యాపారులుగా మారిపోతున్నారట. లెక్కటుగట్టి కోట్లకు ఎలా పడగలెత్తాలని చూస్తున్నారట. ఇదే వైద్యులను అబాసుపాలు చేస్తోంది. వ్యవస్ధను నాశనం చేస్తోంది. ప్రభుత్వాసుపత్రులు ఎకరాల కొద్ది స్ధలాల్లో నిర్మాణాలు చేపడతారు. ఒక నగరంలో వున్న ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఒక ఎత్తైతే, ఒక్క ప్రభుత్వాసుపత్రి ఒక ఎత్తు. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల పెట్టు. అంత మంది స్టాఫ్‌ వుంటారు. ఎకరాల కొద్ది స్ధలంలో నిర్మాణం చేపడతారు. ఎంత పెద్ద ప్రైవేటు ఆసుపత్రైనా సరే ఇరుకైన గదులు, గాలి ఆడని స్ధలాలో ఊపిరి సలపని స్ధితిలో వుంటాయి.

అదే ప్రభుత్వాసుపత్రులు ఎంతో విశాలంగా వుంటాయి. సౌకర్యాలు కూడ పుష్కలంగా వుంటాయి. వరంగల్‌ జిల్లాలో వున్న ఎంజిఏం ఆసుపత్రి ఎంత పెద్దదో, ఎంత విశాలమైందో అందరికీ తెలిసిందే..అలాంటి ఆసుపత్రిలో బాత్రూంలు పనిచేయడం లేదన్న వార్తలు ప్రైవేటు ఆసుప్రత్రలు ప్రచారం చేయడం విడ్డూరం. సహజంగా విశాలమైన స్ధలాలలో వున్న ఆసుపత్రుల్లో ఎలుకల బెడద అన్నది సహజంగా ఎదురౌతుంది. వాటిపై ఎంత ఎంత శ్రద్ద తీసుకున్నా ఎక్కడో అక్కడ సమస్యలు ఎదురౌతుంటాయి. పట్ణణానికి దూరంగా వున్న ప్రభుత్వాసుపత్రుల ఆవరణల్లో పాములు కనిపించడం అన్నది కొన్నిసార్లు సర్వసాధారణం. అదే ప్రైవేటు ఆసుపత్రులంటే నగరం నడిబొడ్డున ఏర్పాటుచేస్తుంటారు. అక్కడ ఇలాంటి సమస్యలు ఎదురయ్యే పరిస్దితి వుండకపోవచ్చు. కాని సరైన వైద్యం అందక ప్రాణాలు పోయే ప్రజల సంఖ్య ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఎక్కువ. కాని అవి బైటకు రావు…ఎలుకలు, పాముల గొడవ మాత్రం బైటకు వస్తాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలను ప్రచారం చేసి,ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల లేమిలాగే వైద్యం కూడా అలాగేవుంటుందని ప్రచారం చేస్తున్నారు… ప్రభుత్వాసుపత్రుల ప్రతిష్టను దిగజార్చే కుట్రలు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్నాయి. ప్రభుత్వం వీటిపై దృష్టిసారించి, ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో మరింత నమ్మకం కల్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *