ప్రభుత్వ వైద్యం…తెలంగాణలో సరికొత్త లోకం.

`విప్లవాల పరంపర.

 `విజయాలు తెలంగాణ ముంగిట.

`కేసిఆర్‌ కలల రూపం…సాక్ష్యాత్కారం..

`తెలంగాణ ఆవిష్కారం…బంగారు తెలంగాణ నిర్మాణం.

`ఎనమిదేళ్లలో కేసిఆర్‌ సంక్షేమ పాలన అద్భుతం.

`మొన్న జల విప్లవం,

`నిన్న సాగు విప్లవం,

`నేడు విద్యా విప్లవం,

`రేపు వైద్య విప్లవం,

`అన్ని రంగాలలో అద్భుత ప్రగతి.

` హరీష్‌ రావు నేతృత్వంలో జలయజ్ఞం…

`మూడేళ్లలో కాళేశ్వరం జల విజయం.

`హరీష్‌ రావుకు కాళేశ్వరరావుగా సరికొత్త నామకరణం.

`హరీష్‌ రావు ఆధ్వర్యంలో వైద్య రంగంలో అనూహ్య ఫలితాలు.

`జిల్లాకో మెడికల్‌ కాలేజీ, అనుబంధంగా మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌.

` వరంగల్‌ నగరానికే తలమానికంగా శరవేగంగా సరికొత్త ఆసుపత్రి నిర్మాణం.

`హైదరాబాద్‌ కు నలువైపులా నాలుగు ఆసుపత్రులు.

`ఏటా వేలాది మంది వైద్యుల సేవల అందుబాటులోకి….

`ఇటు బస్తీ దవఖాలు…అటు ప్రతి పల్లెలో వైద్య సేవలు.

`రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్యానికి స్వర్గసీమ తెలంగాణ.

`ఆరోగ్య వంతమైన తెలంగాణ భరోసా

` త్వరలో ప్రైవేటు వైద్యం కనుమరుగయ్యే తరుణం.

`ఇప్పటికే పలు జిల్లాలలో హోటళ్లుగా మారుతున్న ప్రైవేటు ఆసుపత్రులు.

`భవిష్యత్తులో పూర్తి ఉచిత ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి…

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలోవైద్య విప్లవం ఆవిష్కృతమౌతోంది. అటు పల్లెలనుంచి మొదలు, పట్టణాల్లో బస్తీ దవఖానాలు అన్నవి ఊహలకందని వైద్యసదుపాయాలు అందుతున్న ఏకైక రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలోతెలంగాణలోవైద్యం మృగ్యం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాట వినిపించిన నేలలో నేడు, ప్రభుత్వ వైద్య సేవలు తప్ప ప్రైవేటు సేవల కోసం ఎవరూ చూడడం లేదు. ఇప్పటికే తెలంగాణలో పేద వర్గాలన్నీ ప్రభుత్వ వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో వున్న అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా టెస్టులు కూడా చేస్తున్నారు. జిల్లా ఆసుపత్ల్రుల్లో అధునాతమైన వైద్య పరికారాలు అందుబాటులోకి తెచ్చారు. ఊహించని ఆపరేషన్లు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో చేపడుతున్నారు. ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలల రూపంలో ఒక అద్భుత ఆవిష్కారం…వైద్యం పేదలకు అందుబాటులోకి తెచ్చిన సాక్ష్యాత్కారం. తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు కొదువ లేకుండా చేయడంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూపిన చొరవ ప్రపంచమంతా కీర్తిస్తోంది. పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన తెలంగాణలో ఉద్యమ కాలం నాటి నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పుడు విద్య, వైద్య రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ అంటే ఎండిన బీడులు…పల్లేర్లు మొలిచిన పొలాలు…సాగుకు పనికి రాకుండాపోయిన భూములు…కనీసం వర్షాధారపంటలకు కూడా దిక్కులేని రోజులు…పంట పొలాలలో ఎండిన పంటలు, రైతు కన్నీళ్లు తప్ప, బావుల్లో చుక్క లేని రోజులు. ఎన్ని బోర్లు వేసినా చుక్క నీటి జాడ లేని సందర్భాలు..అయినా ఆశ చావక, నమ్ముకున్న భూమిని వదులుకోలేక సాగు కోసమే తమ జీవితాలను బలి చేసుకున్న ఎంతో మంది రైతుల గోసలు తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. ఆ గోస చూడలేక తెలంగాణ వాదం, నినాదం, జెండా ఎత్తుకొని, తెలంగాణ అంతా ఒక్కటి చేసి, మూడు కోట్ల గొంతులను ఒక్కటి చేసి, జై తెలంగాణ అని నినదించి కొట్లాడిన నాయకుడు కేసిఆర్‌. ఆయన ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎలా ఎగతాళి చేశారో, తెలంగాణ ఆవిష్కారం తర్వాత ప్రగతి గురిచి చెబితే కూడా అలాగే ఆశ్చర్యంగా చూశారు. తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కేసిఆర్‌ ఎంత గట్టిగా చెప్పినా ఎవరూ ముందు నమ్మలేదు. ఇప్పుడు ఆ అధ్భుతం చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు. ఎక్కడ చూసినా నీళ్లే…పచ్చని పంట పొలాలే…ఒకప్పుడు బీడు తప్ప, నీటితో నిండిన మడి కనిపించిన రోజులు లేవు. ఇప్పుడు తడి మడులేగాని, బీడు కనిపించకుండా చేసిన నాయకుడు కేసిఆర్‌. ఆయన సంకల్ప సిద్ధితో తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా సాగులోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా మూడేళ్లలోనే తెలంగాణ సస్యశ్యామలం చేశారు. అందుకోసం తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు సాధ్యం కావన్న వారి నోరు మూయించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, మూడేళ్లలో పూర్తి చేసి ఆ నీటి జలాల ఫలాలు పొలాలు పారుతుంటే కాదన్న వారి కళ్లు తెరుచుకున్నాయి. ఆ అధ్భుతం చూసి, కుళ్లుకున్న వారున్నారు. ఇప్పటికీ అంతుపట్టని ఆ రహస్యం మనసు నిండా నింపుకోలేక ఇప్పటికీ తెలంగాణ మీద విషం చిమ్ముతున్నవారూ వున్నారు. తెలంగాణ కోసం కేసిఆర్‌ కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేది కాదు… ఈ అధ్భుతాలు చూసే వాళ్లుం కాదు…ఒక్క కేసిఆర్‌ మది ఆలోచన రంగరించి అందించిన అద్భుత నైవేద్యం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విప్లవమని చెప్పాలి. అటు కాళేశ్వరం, మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం, మల్లన్న సాగర్‌ వంటి వినూత్నమైన రిజర్వాయర్ల నిర్మాణం అన్నది కలలో కూడా ఊహించిది కాదు…నిజం చేసిన కేసిఆర్‌ను తెలంగాణ ఎన్ని తరాలైనా మర్చిపోదు. ఇప్పటికీ కాకతీయులను ఎలా చెప్పుకుంటున్నారో…అలా అపర భగీరధుడు కేసిఆర్‌ను, ఆ యజ్ఞం పూర్తి చేసిన అభినవ కాళేశ్వరరావు మంత్రి హరీష్‌రావులను చరిత్ర మర్చిపోదు. 

ఒక విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.

 ఒకప్పుడు తెలంగాణ విద్యార్ధులు ప్రైవేటు విద్య కోసం విజయవాడ, గుంటూరు, విశాఖ పట్నం వెళ్లేవారు. అంత స్ధోమత లేని వారు తెలంగాణలోనే వున్న ప్రైవేటు బడులకు వేళ్లేవారు. ఇక పల్లెల్లో దిక్కులేక పేదలకంటూ కనీసం నీడ కూడా లేని బడుల్లో చదువుకునేవారు. చదవించే స్ధోమత వున్నవారు మాత్రమే పక్కఊర్లకు వెళ్లిచదువుకునేవారు. అక్కడడక్కడ హస్టళ్లు వున్నా, అందులో సీటు దొరకడం అంటే గగనం..ఇక అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వుండే రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రవేశం అంటే అదో పెద్ద తతంగం. కాని నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా అందమైన నూతన స్కూలు భవనాలు… గురుకులాలు. కేజి నుంచి పీజి దాకా ఉచిత విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. పేద ప్రజలకు విద్య ఎంతో అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని విద్యా మాఫియా శాసించేది. కాని నేడు అలాంటి ప్రైవేటు వ్యవస్ధను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ విద్యను పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెచ్చి, విద్యా విప్లవాన్ని కూడా తెలంగాణ సాధించిడం ఒక అధ్భుతం. ఇక మన ఊరు…మన బడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. కార్పోరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న స్కూళ్లు భవిష్యత్‌ తరాలకు దేవాలయాలు…తెలంగాణలో నీళ్లు, నియామకాల ప్రక్రియ ఎంతో జరిగిపోయింది. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటి ఎగుమతులు రూ.57వేల కోట్లు వుంటే, ఇప్పుడు 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే తెలంగాణలో ఐటి విప్లవం వచ్చింది. ఒకనాడు ఐటి అంటే బెంగుళూరు గురించి మాట్లాడుకునేవారు. కాని నేడు తెలంగాణ గురించి చెప్పుకుంటున్నారు. తెలంగాణలోని జిల్లాల్లోకి కూడా ఐటి విస్తరించింది. ఒక్క హైదరాబాద్‌లోనే కొన్ని లక్షల మంది ఐటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

 ప్రైవేటు విద్యా వ్యవస్ధను కూకటి వేళ్లతో పెకిలించి, పూర్తిగా ప్రభుత్వ విద్య అందుబాటులోకి వచ్చింది.

 పల్లెల్లో అధ్భుతంగా ప్రభుత్వ బడులలకు తోడు, గురుకులా ఏర్పాటుతో వచ్చే తరం ఎంత గొప్పగా వుంటుందో ఆ విద్యాలయాలను చూస్తేనే అర్ధమౌతుంది. అదే దిశలో ఇప్పుడు ప్రభుత్వ వైద్యం కూడా పరుగులు పెడుతోంది. అమ్మ కడుపులో బిడ్డ పడిన నుంచి మొదలు, ఆ బిడ్డ ప్రపంచాన్ని చూసే దాకా ఆలనా పాలన మొత్తం ప్రభుత్వమే చూస్తోంది. తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. తల్లి గర్భంతో వున్నంత కాలం పోషకాలతో కూడిన కిట్‌ను అందజేస్తున్నారు. ప్రతి నెల ఉచితంగా చెకప్‌లు చేస్తున్నారు. నెలలు నిండిన తర్వాత ప్రభుత్వ ఆంబులెన్స్‌లోనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నారు. పురుడు పోస్తున్నారు. కేసిఆర్‌ కిట్‌ ఇచ్చి, మళ్లీ ఇంటికి చేర్చుతున్నారు. ఇంతగా ప్రభుత్వం తల్లీబిడ్డల సంక్షేమం ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణలోనే ఇంతటి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇదిలా వుంటే తెలంగాణలో ఇప్పటికే కొన్ని వైద్య కళాశాల ఏర్పాటు జరిగింది. వాటి ద్వారా కూడా ప్రజలకు ఉచిత వైద్యం అందుతోంది. ఇక అన్ని జిల్లాల్లో త్వరలో వైద్య కళాశాలల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. ఏటా కొన్ని వేల మంది యువ వైద్యులు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు. దాంతో పట్టణాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాలలో ప్రజలు వద్దకే వైద్యం అందుబాటలోకి వచ్చింది. పల్లెల్లో కూడా ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యం పల్లెలకు చేరింది. ఇక హైదరాబాద్‌ చుట్టూ నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వరంగల్‌లో ముప్పై అంతస్ధుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం దసరా వరకు అందుబాటులోకి రానున్నది. ఇలా తెలంగాణలో వైద్య విప్లవం వస్తోంది. ఇప్పటికే అనేక జిల్లా కేంద్రాల్లో అందుతున్న ప్రభుత్వ వైద్య సేవల మూలంగా ఇప్పటిదాకా పేదల రక్తం తాగిన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహన జరగక, వాటిని హోటళ్లుగా మార్చుకుంటున్నారు. ఇక జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు మొదలైతే ఇక ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లు చీటి కాలమొచ్చే రోజులు త్వరలోనే వున్నాయి. ఇలా తెలంగాణ అన్ని రంగాలలో స్వర్గ సీమగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు…దటీజ్‌ కేసిఆర్‌…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!