ప్రతి విద్యార్థికి ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉండాలి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ విజయ రఘునందన్ రావు.
రాజన్న సిరిసిల్ల టౌన్: నేటిధాత్రి
సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
2023 24 సంవత్సరము గాను కళాశాల విద్యార్థులకు
ఎన్నికల నిర్వహణలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు
కళాశాలలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ పై
అవగాహన కల్పించేందుకు కళాశాల అధ్యక్షుడు
అధ్యక్షురాలని ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికను నిర్వహణలో ముఖ్యఅతిథిగా హాజరైన సిరిసిల్ల తహసిల్దార్ ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ రావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు విలువపై అవగాహన కల్పించేందుకే కళాశాలలో
ఎన్నికలు నిర్వహించామని తెలిపారు.
ఎన్నికలలో ప్రభుత్వ కళాశాల అధ్యక్షులుగా వినయ్ ఉపాధ్యక్షుడిగా విక్రమ్ ఎన్నికయ్యారు గర్ల్స్అధ్యక్షురాలిగా అశ్విని ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యాపకులు బుర్ర వెంకటేశం గౌడ్ సామల వివేకానంద కనకయ్య అరుంధతి వికాస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.