ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘణంగ నిర్వహించిన ఆదివాసి సంక్షేమ పరిషత్.సంఘలు.

కారేపల్లి నేటి ధాత్రి:

ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు కారేపల్లి మండల కేంద్రం నందు ఆదివారం సంక్షేమ పరిషత్ మరియు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కారేపల్లి ఎస్సై రామారావు ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగిస్తూ ఆదివాసులకు ఐక్యరాజ్యసమితి 1982లో ఆగస్టు 9వ తారీఖున ఆదివాసి దినోత్సవంగా ప్రకటన చేసి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహించుటకు నిర్ణయం చేసినారు దానిలో భాగంగా ఆదివాసులు విద్య ఉద్యోగం వంటి రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని విద్యలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తమ జీవితాలను మార్చుకొనుటకు విద్య ఒక్కటే ప్రథమ మార్గమని అటువంటి విద్యను ఆదివాసులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ద బోయిన ఉమాశంకర్.వైస్ ఎంపిపి రావూరి శ్రీనివాసరావు.అజ్మీరవీరన్న. సర్పంచ్ కుమార్ .ప్రజా సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టం నాగేశ్వరరావు జిల్లా నాయకులు పూనమ్ శివరాం కల్తి రాంప్రసాద్ ఈశాల రాంబాబు ఎట్టి కోటేశ్వరావు కల్తీ పాండురంగయ్య ఈ సందర్భంగా లక్ష్మణ్ ఎదలపల్లి శీను సీమల శ్రీనివాస్ ఈసం భాస్కర్ నాగేశ్వరావు మొదలైన వారు పాల్గొన్నారు ఎంత డిపార్ట్మెంట్ నుంచి మహిళా ఉద్యోగులు ఐసిడిఎస్ ఉద్యోగులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!