ప్రధాని మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం విచారకరం:ఎంపీ రవిచంద్ర

బీజేపీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది:ఎంపీ రవిచంద్ర

రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయడం వృధా:ఎంపీ రవిచంద్ర

చండూరులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర

చండూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.ఆయన పార్టీ బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాలకు,పేద సాదలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు.ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ,బీసీ,మహిళలపై ప్రతి నిత్యం దాడులు జరుగుతుంటాయని వద్దిరాజు ఆవేదన చెందారు.అటువంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాజగోపాల్ కు పొరపాటున కూడా ఓటేయ్యొద్దని,ఒకవేళ వేసినట్టయితే వృధా అవుతుందన్నారు.చండూరులో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ వద్దిరాజు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా హరిశంకర్ లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం గురుతర బాధ్యత మనందరిపై ఉందని రవిచంద్ర వివరించారు.సమ్మేళనానికి అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ, మునుగోడు సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో మున్నూరుకాపు ప్రముఖులు బండి సంజీవ్, విష్ణుజగతి,వాసుదేవుల వెంకటనర్సయ్య,జెన్నాయికోడే జగన్మోహన్, వనమాల ప్రవీణ్,యాద క్రాంతి పటేల్,అనిల్ పటేల్,శ్రీధర్ బాబు, రామస్వామి వెంకటేశ్వర్లు,పాశం కిరణ్,సకినాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *