*ఎస్ఐ రాజేష్
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మైనర్లు వాహనాలు నడుపుతూ కనిపించిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రుద్రంగి మండల ఎస్ఐ రాజేష్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి పొలిస్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించరు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం ర్యాస్ డ్రైవింగ్ చేసిన ప్రజలకు ఇబ్బంది కలిగేలా వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.వాహనదారులు హెల్మిట్ తో పాటు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని,వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా ఉండాలని నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి ఒక్కరు రోడ్డు నియమనిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.