కేయూ క్యాంపస్
కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ఆచార్య బన్న అయిలయ్య ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో కానీ, సీమాంధ్ర వలస వాదుల పాలనలో కానీ తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంతం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని,వివక్షను తన పాటతో, మాటతో ప్రశ్నిస్తూ నిద్రాణమై ఉన్న తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిలించిన గొప్ప కవి, పోరాట యోధుడు గద్దర్ అని తెలిపారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కాత్యాయని విద్మహే మాట్లాడుతూ నూతన సమాజం కోసం పాటుపడుతూ జీవితాంతం ప్రజల కోసం జీవించిన విప్లవ కెరటం గద్దర్ లేని లోటు తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంథని శంకర్, డాక్టర్ ఆగపాటి రాజ్ కుమార్, పీజీ విద్యార్థులు , పరిశోధకలు పాల్గొన్నారు