గడపగడపన అభివృద్ధి, సంక్షేమ ఫలాల సర్వే కార్యక్రమం
శాయంపేట నేటి దాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని పెద్దకోడేపాక గ్రామంలో గడప గడపన సంక్షేమ ఫలాల సర్వే కార్యక్రమాన్ని ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎన్నో అభివృద్ధికార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక సంక్షేమ పథకాలతో అధిక నిధులను వెచ్చిస్తూ ప్రజల మనలను పొందిన మహోన్నత నాయకులు గండ్ర దంపతులు అని అన్నారు.గ్రామంలో గడపగడపన సంక్షేమ పథకాల సర్వే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రజల యొక్క స్పందన చాలా గొప్పగా ఉందని అన్నారు.ప్రతి కుటుంబంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు పొందిన లబ్ధిదారులు ఉన్నారని తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం అలా కష్టపడి పనిచేస్తున్న నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని,మరో మారు విజయాన్ని కట్టపెట్టే బాధ్యత ప్రజలే తీసుకుంటారని తెలియజేశారు. మరో మారు భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రేణిగుంట్ల సదయ్య మండల నాయకులు, ఇమ్మడిశెట్టి రవీందర్, మాజీ సర్పంచ్ జిన్న రాజేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు వినుకొండ శంకరాచారి,మండల సోషల్ మీడియా అధ్యక్షులు మామిడి అశోక్, గ్రామ సర్పంచులు అబ్బు ప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీలు మాచర్ల మంగమ్మ రవి, వావిలాల వేణుగోపాల్, పిఎసిఎస్ డైరెక్టర్ మంద మల్లయ్య,బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోగిల కిరణ్, మాజీ అధ్యక్షులు కోగిల తిరుపతి,యువజన నాయకులు కొమ్ముల సంతోష్,
సీనియర్ పార్టీ నాయకులు ముల్క రమేష్,గ్రామ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలుతదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.