ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న కౌన్సిలర్
జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : కౌన్సిలర్ గా గెలిచినప్పటి నుండి ప్రజల్లో ఒకడిగా ఉంటూ వారికి ఎల్లవేళలా నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న జమ్మికుంట పురపాలక సంఘం మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గౌడ్ కు కాలనీ ప్రజలు గురువారం కౌన్సిలర్ పదవి చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీపతి నరేష్ ప్రస్తుతం తమ కాలనీలో నెలకొన్న సమస్యలను తనదిగా భావిస్తూ.. వాటి పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నాడని. గెలిచిన రెండెండ్ల కాలంలో కాలనీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడని పేర్కొన్నారు. అకాల వర్షాలు వచ్చి కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరిన సందర్భంలో తను ముందుండి వరద బారినపడిన ప్రజలకు చేయూతను అందించేందుకు ఎంతో సాహసించాడని తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వారికి జరిగిన నష్టానికి నష్ట పరిహారం ఇప్పించాడని కొనియాడారు. ఇటీవల ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందగా అతన్ని దహన సంస్కారాలు చేయడంలో కాలనీ ప్రజలు వెనుకాడుతున్న సమయంలో సైతం తను ప్రాణాలకు తెగించి అట్టి వ్యక్తి యొక్క దహన సంస్కారాలు దగ్గరుండి చేయించడం అభినందనీయమన్నారు.