రక్తదానం మహాదానం,రక్తదానంపై అపోహలు వద్దు : ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, నేటిధాత్రి: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలు నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం,దేశం కోసం,రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు.పేద ప్రజలు,బాధితులకు సత్వర న్యాయం అందించడం,ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. థలసేమియా,క్యాన్సర్,హిమోఫీలియా,రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని,రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని అని అన్నారు.రక్తదానం మహాదానమని,రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ అన్నారు.ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఉపయోగపడుతుందని తెలియజేసారు.ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి ప్రతీ 5 నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా శరీరం మరింత ఉత్సాహవంతంగా మారుతుందని అన్నారు.ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు సబ్ డివిజన్ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్అధికారులు ,సిబ్బంది, యువత కు ప్రజలందరికీ కృతజ్ఞతలు, తెలిపారు .డిఎస్పీ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం ద్వారా 130 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కొత్తగూడెం పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు,ఎస్బి ఇన్స్పెక్టర్ స్వామి,సిఐలు రమాకాంత్,సత్యనారాయణ, రాజు,అబ్బయ్య,వసంత్ కుమార్,ఆర్ఐలు దామోదర్,కామరాజు,ఎస్సైలలు,డాక్టర్ రవిబాబు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.