పేద విద్యార్థులకు శాపంగా మారనున్న ఇంజనీరింగ్ ఫీజుల పెంపు

ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు

చేర్యాల నేటిధాత్రి..

తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు వేలాదిమంది ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి కాబట్టి వారికి అనుకూలంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులు పెంచిందని ఈ ఫీజుల పెంపు విద్యార్థులకు శాపంగా మారనుందని ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు 

ఈ సందర్భంగా పుల్లని వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెంచేందుకు జీవో ఉత్తర్వులు జారీ చేయడం అందులో దాదాపు 40 కళాశాలలో లక్షకు పైగా ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇవ్వడం సరికాదని చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేవని, నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలలు పుట్టగొడుగుల ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వని కళాశాలల్లో కూడా ఫీజులు పెంచారని ఈ ఫీజుల పెంపు నిర్ణయం వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని కరోనా కష్ట కాలంనుండి విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ఇప్పుడు ఫీజుల పెంపు వల్ల పై భారీగా ఆర్థిక బారం పడనుందని 2019 నుండి ఉన్న ఫీజులనే తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంకి ఫీజుల పెంపు మీద ఉన్న శ్రద్ధ ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు పెంచడంపై అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడంపై లేదని చాలా కళాశాలల్లో పెరిగిన ఫీజు కడితేనే విద్యార్థులకు సీటు కన్ఫర్మేషన్ అయ్యే పరిస్థితి ఉందని ఓ పక్క ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చాలా కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరాలంటే పూర్తిస్థాయి ఫీజు కట్టాలని యాజమాన్యాల విద్యార్థులకు చెపుతున్నాయని చాలా కళాశాలల్లో డొనేషన్ ఫీజు పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల వారికి వత్తాసు పలుకుతూన్నారని వెంటనే ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో ఉన్నత విద్యామండలి,విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!