ఆర్థిక లేమి …తండ్రి అకాల మరణం
సహకారం కోసం ఎన్ ఎఫ్ ఎచ్ సి ఫౌండేషన్ విజ్ఞప్తి
కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
అందరిలా సాధారణ జీవితం గడపకుండా తనకంటూ ఒక లక్ష్యాన్ని చేసుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లి సమాజంలో నుంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశయాలు ఆర్థికలేమితో అడియాసలు అయ్యే పరిస్థితి.వివరాల్లోకి వెళితే కేసముద్రం మండలం సప్పిడి గుట్ట తండాకు చెంది సాపావత్ రేణుక ప్రొఫెసర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతుంది.కష్టపడి చదివి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న రేణుక తండ్రి అకాలంగా మృతి చెందారు.తండ్రి మరణించిన క్షోభ ఉండగా అంతేకాకుండా తలకు మించిన భారంగా అప్పులు కూడా భారంగా మారాయి.ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో బి ఎస్సీ అగ్రికల్చరల్ చేస్తున్నది.కాగా ఆమె చదువు కొనసాగించేందుకు,దాతలు,సంఘాలు,ఎంప్లాయిస్ అందరూ ఆర్ధిక సహకారం అందించాల్సిందిగా ఎన్ ఎఫ్ హెచ్ సి ఫౌండేషన్ వ్యవస్థపాక సభ్యుడు మోహన్ విజ్ఞప్తి చేసారు.మండలంలో తావుర్య తండ నివాసి అయిన మోహన్,బెంగళూరు లో జాబ్ చేస్తూ,వెనకబడిన వర్గాల శ్రేయస్సు కోసం,విద్యార్థుల మేలు కోసం ఫౌండేషన్ తరుపున సహకారం అందిస్తుంటారు.అలాగే తండ్రిని కోల్పోయిన పేద విద్యార్థిని రేణుక చదువును ఆపకుండా,ముందుకు సాగేలా ఫౌండేషన్ తరుపున డొనేషన్స్ చేస్తూ,ప్రజలు,దాతలు అందరూ ఈ పేద విద్యార్ధికి సహకారం అందిస్తే,సమాజానికి ఒక మంచి వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి,సేవలు అందిస్తారని ఆశిస్తున్నారు.సపావత్ రేణుక ఉన్నత చదువులు చదువుతున్న ఒక తెలివైన మరియు కష్టపడి పనిచేసే విద్యార్థిని.ఆమెకు నేర్చుకోవాలనే తపన,విజయవంతమైన వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనే కల ఉంది.అయితే రూ.7 లక్షలకు పైగా అప్పులు మిగిల్చి తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆమె జీవితం విషాద మలుపు తిరిగింది.ఆమె తల్లి కుటుంబానికి ఏకైక ఆధారం మరియు జీవనోపాధి కోసం కష్టపడుతోంది.రేణుక తన విద్యను కొనసాగించడానికి మరియు ఆమె లక్ష్యాలను సాధించడానికి మీ సహాయం కావాలని కోరారు.ఆమెకు మరో మూడేళ్ల కాలేజీ పూర్తి చేయాల్సి ఉంది,దీనికి ట్యూషన్ మరియు మెస్ ఫీజుల కోసం సుమారు రూ.4 లక్షలు ఖర్చవుతుంది.ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచి తన చదువును పూర్తి చేయడానికి దోహదపడే ఉదార దాతల కోసం ఆమె వెతుకుతోంది.దాతలు విద్యార్థిని రేణుక ఫోన్ పే,గూగుల్ పే నెంబర్ +91 80193 05451 కి సహాయం చేయవలసిందిగా కోరారు.