పేదింటి పెళ్లికి ఆపన్న హస్తం
నేటిధాత్రి కొండపాక:అసలే పేదరికం.. ఆపై తల్లిదండ్రుల అనారోగ్యం …ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి తల్లిదండ్రులకు కష్టంగా మారింది. దీనిని గుర్తించిన ఆపన్న హస్తం మిత్ర బృందం ఆర్థిక సహాయం అందించి తమ గొప్పతనాన్ని నిరూపించుకుంది. కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి సుజాత యాదగిరి కూతురు శివాని పెళ్లికి కి రూ 34000 విలువచేసే వంటింటి సామాగ్రి ఇతర వస్తువులు అందజేశారు. బృందం సభ్యులు తమ ఆర్థిక స్తోమతను బట్టి విడిగా ఆర్థిక సహాయం అందించి శివాని పెళ్ళి పెళ్లి పెద్దలు అయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలచంద్రన్ కార్యదర్శి శ్రీనివాస్ పాటు శ్యాం ప్రసాద్, సాయి, స్వామి మల్లేశం అక్బర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.