నేటిధాత్రి హనుమకొండ
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని
తెలిపారు. గీసుగొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 63 లబ్దిదారులకు రూ.63 లక్షలకు పైగా విలువచేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాల ద్వారా ఒక లక్షా నూటపదహారు రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండలాల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.