పెద్దమ్మతల్లి సాక్షిగా…. తప్పు చేసినోళ్ళు ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతారు.

# పక్క పార్టోనికి 33 కులాల ఉసురు తగులుతది.

# నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

# ఎన్నికల తర్వాత ముదిరాజ్ ల తలరాతలు మరింత మార్పు..

# శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్

# మార్కెట్ చైర్మన్ మొగిలికి ఘన సన్మానం

# ముదిరాజ్ కుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి :

గత ఎన్నికల ముందు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న 33 కులాల ఆత్మ గౌరవ భవనాలకు వారిని ఆపివేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చారని ఈ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలు ఆపిన వారికి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతారని పెద్దమ్మ తల్లి సాక్షిగా చెపుతున్న అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శపించారు.రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిననాటి నుండి ఆర్థికంగా సహకరిస్తున్నదని మరోసారి వచ్చే ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మా ముదిరాజ్ తలలు మారబోనున్నాయని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు.నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తెలంగాణ ఉద్యమ నాయకుడు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ నేపథ్యంలో
నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ కుల బాందవుల ఆత్మీయ అభినందన సభ నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గల పెద్దమ్మ తల్లి దేవాలయం అవరణలో నిర్వహించారు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటిక సోమన్న అధ్యక్షతన ఆత్మీయ సభను నిర్వహించగా ముఖ్య అతిధులుగా రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్భంగా శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ వరంగల్ పూర్వ జిల్లాలో కేసముద్రం,నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవలు ముదిరాజ్ కులస్తులకు అవకాశాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అనేక మార్పులు వస్తున్నాయని అందులో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ బిడ్డలకు నామినేటెడ్ పదవులు,ప్రజా ప్రతినిధుల పదవులు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తర్వాత సీఎం కేసీఆర్ అధ్వర్యంలో 34 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ముదిరాజ్ ముద్దుబిడ్డనైన
నన్ను ఎన్నుకొని ఢిల్లీ రాజ్యసభకు పంపారని ఆ తర్వాత నేడు అదే సీఎం కేసీఆర్ మరోసారి శాసన మండలి వైస్ చైర్మన్ గా మదిరాజ్ కులానికి గౌరవం ఇచ్చి కులం అభివృద్ధి కోసం అవకాశం కల్పించారని వివరించారు.ముదిరాజ్ కులం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్ కోకపేట వద్ద 5 ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వగా దాని విలువ 500 కోట్లకు చేరుకున్నదని తెలిపారు.గతంలో వర్గాల కులాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో నేడు కేసీఆర్ ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాలు ఇస్తున్నదన్నారు.ముదిరాజ్ కులస్తులకు 1000 కోట్ల రూపాయలతో వివిధ రకాల వాహనాలు 75 శాతం సబ్సిడీతో అందించిందని చెప్పారు. మత్స్య కార్మికుల పట్ల చెరువుల్లో నీటి వనరులు బలంగా పెరగడం కోసం గోదావరి జలాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందించారని అన్నారు.
జాతీ ఐక్యత కోసం ఐక్యంగా ఉంటేనే భవిష్యత్ ఉంటుందని రాబోయే ఎన్నికల తర్వాత ముదిరాజ్ ల తలరాతలు సీఎం కేసీఆర్ మర్పిస్తారని హామీ ఇచ్చారు.కులానికి సహకరించే వారితో కలిసి ఉండాలని ముదిరాజ్ కులస్తులకు శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ సూచించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ సూచనల ప్రకారమే
రాజకీయ నిర్ణయం మేరకు అవకాశం తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం మొగిలి మార్కెట్ కమిటీ చైర్మన్ అవకాశం దక్కిందన్నారు.నిరుపేదలైన ముదిరాజ్ కులస్తుల కష్టాలు దగ్గరుండి చూసినవాడినని ఊరిని, కష్టాన్ని, నాయకున్ని నమ్ముకొని పనిచేసేవారికి పలితం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.33 కులాలకు ఆత్మ గౌరవం దక్కించుకునేందుకు ఆత్మ గౌరవ భవనాలు ఇస్తానని ఐదేండ్ల క్రితం మాట ఇచ్చిన కానీ ఆ మాటకు ఒక రాజకీయ పార్టీ నాయకులు భవనాలు ఆపేందుకు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారు ఐనా ఆ భవనాలు పూర్తి చేసి చూపిస్తా..అని మరోసారి ఎమ్మెల్యే పెద్ది హామీ ఇచ్చారు.ఆత్మ గౌరవ భవనాలు ఆపిన పక్క పార్టీ నాయకులకు 33 కులాల ఉసురు తగులుతుందని అవేదన వ్యక్తంచేశారు.ముదిరాజ్ కులస్తులకు కూడా పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద మాట ఇచ్చిన ప్రతుతం పనులు మొదలయ్యాయి కానీ 33 కులాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన పక్క పార్టీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని ఇది పెద్దమ్మతల్లి సాక్షిగా చెపుతున్న అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ముదిరాజ్ కులస్తుల వెంట నాడు నేడు ఎప్పటికీ మీ వెంట ఉంటానని రాజకీయ ఎన్నికలలో అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.మార్కెట్ చైర్మన్ పొన్నం మొగిలి మాట్లాడుతూ
23 సంవత్సరాలుగా ఉద్యమంలో పాల్గొన్న,పార్టీ కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అందించారని అన్నారు.
ముదిరాజ్ కులస్తుల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.రైతుల అధ్యున్నతి కోసం పని చేస్తానని మొగిలి పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ,చేపల పిల్లల పంపిణీ ఉచితంగా, వివిధ రకాల వాహనాలు అందించారని వివరించారు.నిరుపేదలైన గ్రామాల్లో వచ్చే లబ్ది కాకుండా పెద్దమ్మతల్లి దేవాలయం పరిధిలో ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కోటి రూపాయల నిధులు కేటాయించిన ఎమ్మెల్యే పెద్ది వెంట ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,వరంగల్ జిల్లా మత్స్య శాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య,
జిల్లా ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు గొనెల పద్మ నరహరి,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత నర్సయ్య, బస్స మల్లేశం, పోలు అమర్ చంద్, తూటి శ్రీను, నూనె నరసయ్య, ఈర్ల నరసింహ రాములు,
విజయరామరాజు, తాడబోయిన స్వామినాథ్, తోట సాంబయ్య, పల్లె రమేష్, ముత్యాల స్వామి, మారపాక నరసయ్య, చింతకాయల నరేందర్, డేగల శ్రీనివాస్, పోలేకపోయిన మురళి, కీసరి వెంకటేశ్వర్లు, నాయిని వేణు లతోపాటు పలువురు నాయకులు, డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *