ఇల్లంతకుంట:నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కుర్ గ్రామంలో తాము చదువుకున్న పాఠశాల మరమత్తులు మరియు అభివృద్ధి కోసం 1997-98 బ్యాచ్ కీ చెందిన విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకీ రూపాయలు 13000/-మరీయు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకీ రూపాయలు 15000/- ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో 1997-98 చెందిన పూర్వ విద్యార్థులు బతిని విప్లవ్,సిద్దం మహేందర్ మరియు కందికట్కుర్ గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్,ఎంపీటీసీదొమ్మటి కిషోర్ గౌడ్, స్కూల్ ఛైర్మన్ లు బుర్ల శ్యామల, రంగు రజిని,మరియు ఎఏంసి డైరెక్టర్ పొన్నం శేఖర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి,కో అప్షన్ మెంబర్ చెన్న లక్షయ్యా,హెడ్మాస్టర్ లు శ్రీనివాస్,లక్ష్మినారాయణ, మరియు వర్డ్ మెంబర్ లతకిరణ్,రోషల్,సావనపెల్లి పర్శరం,ఐలయ్య,కమలాకర్ ఎల్లయ్య,ప్రశాంత్,వేణు తదితులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 5000/- రూపాయలు పాఠశాల అభివృద్ధి కోసం విరాళం చేసిన 1997-98 బ్యాచ్ కీ చెందినా రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.