పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపులను నియంత్రించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్

పాలకుర్తి నేటిధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మధ్య మాఫియాను అరికట్టడంలో ఎక్సేంజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామాలలో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ విమర్శించారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం మండల నాయకులు సోమసత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ వివిధ గ్రామాలలో వైన్ షాపు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బెల్టు షాపు వాళ్లు అధిక ధరలకు మధ్యాన్ని అమ్ముతూ మద్యం ప్రియుల జేబులు గుల్లా చేస్తూనే మరోవైపు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే వైన్ షాపు యజమానులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపుల దందాను నడిపిస్తుంటే సంబంధిత ఎక్సేంజ్ అధికారులు పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు వాపోతున్నారు. బెల్టు షాపుల వల్ల గ్రామాలలో ఉదయం నుండి మొదలుకొని రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుడంతో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పాడుతుందని ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో బెల్ట్ షాపులు వందల సంఖ్యలో వెలుస్తున్నాయని అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే గ్రామాలలో బెల్ట్ షాపులను నియంత్రించాలని ఇంత జరుగుతున్న ఎక్సేంజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు కానీ షాపు యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాలలో పేదలు, కూలీలు, యువకులు లిక్కర్కు అలవాటు పడుతూ మద్యానికి బానిసై పనులకు సైతం వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులోనే వారి జీవితం తెల్లారిపోతుందని, మద్యం మత్తులో కుటుంబ కలహాలు ఎక్కువై సంసారాలు బజార్న పడుతున్నాయని బెల్ట్ షాపుల వల్ల మహిళలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడి పోతున్నారని ఇప్పటికైనా ఎక్స్చేంజ్ అధికారులు నిద్రమత్తు విడిచి బెల్ట్ షాపులను నియంత్రించాలని అధిక ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపుల యజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, నాయకులు ముసుకు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!