జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి
అధ్యక్షులు కారం సీతారామన్న దొర( ఢిల్లీ బాబు)
అరకు పార్లమెంట్ పరిధిలో మన్యం రహదారుల అభివృద్ధికి పీఎం జన్‌మన్ పథకం కింద 36 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.
కేంద్రప్రభుత్వం నిధులతో మూడు మండలాల్లో రూ.36 కోట్లతో 20 రహదారులను అభివృద్ధి చేయుటకు
నిధులు మంజూరు చేయటంపై హర్షం వ్యక్తం చేశారు.
అనంతగిరి మండలంలో 8రహదారులు,
అరకులోయ మండలంలో 2రహదారులు, డుంబ్రిగుడ మండలంలో 10 రహదారులను తారు రోడ్లుగా అభివృద్ధి పరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మన్యం ప్రజల డోలీ మోతలు పుల్ స్టాప్ పడినట్టు అయిందన్నారు, ఆగస్టు నాటికి టెండర్లు ప్రక్రియను పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కోరారు.అనంతగిరి మండలంలో గుమ్మకోట-గాలిపాడు మధ్య 8 కిలోమీటర్లు మేర రహదారి అభివృద్ధికి రూ.6.6 కోట్లు, ఎన్‌ఆర్‌పురం-గాదిలలోవ వరకు 8 కిలోమీటర్లకు రూ.7 కోట్లు, అరకులోయ మండలంలో బస్కీ రహదారిలో 11 కిలోమీటర్లు పూర్తి స్థాయి మరమ్మతులకు రూ.3.3 కోట్లు మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వానికి మన్యం ప్రజలు రుణపడి ఉంటారన్నారు, వీటన్నింటికి అటవీ శాఖ అనుమతులు ఆలస్యం చేయకుండా తక్షణమే అనుమతులను ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం కోరారు, మూడు మండలాల్లో పలు ప్రధాన రహదారుల మరమ్మతులకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు.
కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు)
అధ్యక్షులు
జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి
ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ