`స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి అంతకంతకూ పెరిగిపోతోంది?
` ఒక్కొక్కరు ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా గతంలో పట్టలేదు?
`కొత్త కమీషనర్ ఫైళ్లు దులుపుతున్నారని సమాచారం?
`పిర్యాదుల కదలికపై సర్వత్రా ఎదురుచూపులు?
`అత్యధికంగా ములుగు రిజిస్ట్రేషన్ కార్యాలయం మీదే పిర్యాదులు?
`ప్రభుత్వ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త భద్రయ్యను చంపబోయారు?
`ఇలాంటి దుశ్చర్యలకు అడ్డా రిజిస్ట్రేషన్ కార్యాలయమే అన్న ఆరోపణలు కోకల్లలు?
`ఇంతకీ కమీషనర్ కార్యాలయంలో తిష్ట వేసుకుని అవినీతి పరులను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?
`పిర్యాదు దస్త్రాలు, కమీషనర్ దాకా చేరకుండా చేస్తున్నదెవరు?
`ఏళ్లకేళ్లు తిష్ట వేసుకుని అక్రమార్కులకు అండగా వుంటున్నదెవరు?
హైదరాబాద్,నేటిధాత్రి:
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కమీషనర్లు వస్తున్నారు…పోతున్నారు…కాని ఫైళ్లు కదలడం లేదు…వాటికి మోక్షం రావడం లేదు. పిర్యాధు దారులకు న్యాయం జరగడం లేదు…ఆ శాఖలో అన్యాయాలు ఆగడం లేదు. అవినీతికి అంతు లేదు…చాలా మందికి భయం లేదు…ఎన్ని పిర్యాధులందినా పై స్ధాయి వారి ఆశీస్సులు పుష్కలంగా వుండడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది…ఆఖరుకు ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు?
మొగుళ్ల భద్రయ్య ములుగు జిల్లాలో ఓ సామాజిక కార్యకర్త.
జిల్లాలో ఎక్కడ అవినీతి జరిగినా సహించలేడు. తన సామాజిక భాద్యతను నిర్వర్తిస్తుంటాడు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తుంటాడు. అలాంటి వ్యక్తిపై కత్తులతో కొందరు దాడి చేశారు. తాము చేస్తున్న అక్రమాలకు భద్రయ్య అడ్డు వస్తున్నాడని కక్ష కట్టారు. ఆయనను తీవ్రంగా గాయపర్చారు. భద్రయ్య తృటిలో ప్రాణాలతో బైట పడ్డారు. ఆయనపై దాడి చేస్తున్న సమయంలో స్ధానిక ప్రజలు చూడడం వల్ల దాడి చేసిన వారు పారిపోయారు. దాంతో భద్రయ్య ప్రాణాలతో వున్నాడు. అలాంటి వ్యక్తి కమీషనర్ కార్యాలయంలో ఇచ్చిన పిర్యాధులకే దిక్కు లేదంటే ఇక రిజిస్ట్రేషన్ శాఖ ఎవరికి న్యాయం చేస్తుంది. ఆయనేమైనా తన గురించి కొట్లాడుతున్నాడా? ప్రభుత్వ స్ధలం అన్యాక్రాంతమైంది. రిజిస్ట్రేషన్ కార్యాయలం ఆశీస్సుల సాక్షిగా అక్రమంగా రిజిస్రేషన్ జరిగిందన్న విషయాన్ని బైటపెట్టాడు. జరిగిన దుర్మార్గాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు పిర్యాధు చేశాడు. మీడియాకు సాక్ష్యాధారాలతో సహా వివరాలు వెల్లడిరచారు. అలాంటి వ్యక్తిని వెంబడిరచి, ఆయన ఇంటిమీదకు వెళ్లి, కత్తులతో దాడి చేశారు. ప్రాణాలు తీయబోయారు. పోలీస్ స్టేషన్‌లో పిర్యాధు చేశారు. దాడి చేసిన వ్యక్తి జైలుకు వెళ్లడం జరిగింది. రేపో మాపో జైలుకు వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చే సమయం ఆసన్నమైంది. అయినా ఆ భూమి ప్రభుత్వ స్వాధీనం కాలేదు. దానిపై ఇంత వరకు దృష్టిపెట్టిన పాపాన పోలేదు. కలెక్టర్ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు లేవు. వివరాల సేకరణ జరగలేదు. జరిగిన దాష్టికంపై మాట్లాడిన వారు లేదు. ములుగులో సబ్ రిజిస్ట్రార్ కార్యాయలంలో అక్రమ రిజిస్ట్రేషన్లు కోకొల్లలుగా జరుగుతున్నాయన్న పిర్యాధులపై పట్టింపు లేదు. ఒక సామాజిక కార్యకర్త భద్రయ్యకు వున్న సోయి శాఖ పెద్దలకు లేదు. ఉద్యోగులకు లేదు. నిస్వార్ధంగా ప్రభుత్వ భూములను కాపాడుతున్న భద్రయ్యను అభినందించాల్సిన పై స్ధాయి ఉద్యోగులే ఆయనను తిప్పించుకుంటున్నారు. ములుగు నుంచి భద్రయ్య హైదరాబాద్ వెల్లడానికి ఎంత శ్రమ పడాల్సివస్తుందో తెలియంది కాదు. ఇప్పటికీ కమీషనర్ కార్యాలయంలో రెండుసార్లు పిర్యాధు చేశాడు. కాని ఆ పిర్యాధు ఏమైంది? ఎంత వరకు వచ్చింది? టప్పాల్ దాటి కదిలిందా? లేదా? కమీషనర్ టేబుల్ వరకు ఎందుకు చేరడం లేదు? మధ్యలోనే ఎందుకు మాయమౌతోంది? అక్కడ కూడా వున్న అదృష్య శక్తులు ఎవరన్నదానిపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పిర్యాధు దారుడైన భద్రయ్య మరోసారి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం గురించి కొత్త
కమీషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వెళ్లాడు.
కాని అక్కడున్న ఓ ఉద్యోగి భద్రయ్య ఓ గదిలో కూర్చోమని చెప్పి, అడిషినల్ కమీషనర్ వద్దకు పంపకుండా కాలయాపన చేశాడు. చివరికి భద్రయ్య ఒత్తిడి మీరకు తప్పలేదు. అయితే ఈలోపు సదరు ఉద్యోగి ములుగుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సమాచారం అందించినట్లు తెలిసిందని భద్రయ్య వెల్లడిరచారు. అంటే కింది స్ధాయి నుంచి కమీషనర్ కార్యాలయం వరకు ఎంత అవినీతి లింక్ బలంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే గతంతో వరంగల్‌లో పనిచేసిన ఓ ఉఓద్యోగి కమీషనర్ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్నాడు. అతనే ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వస్తున్న పిర్యాధులన్నీ మాయం చేస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ఆ దస్త్రాలు కమీషనర్‌దాకా వెళ్లకుండా చేస్తున్నాడంటున్నారు. లేకుంటే వందలాదిగా వస్తున్న పిర్యాధులు ఒక్కటి కూడా కమీషనర్ దాకా ఎందుకు వెళ్లడం లేదన్న అనుమానం అందరిలోనూ మొదలైంది. అంతే కాకుండా జోన్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఓ డిఐజి కూడా అవినీతి పరులను వెనకేసుకొస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు డిఐజీ గత దశాబ్ధ కాలానికి పైగా అదే జోన్‌లో పని చేస్తుండడం అనుమానాలకు బలం చేకూరుతోంది. ఏ శాఖలోనైనా రెండేళ్లకు మించి ఒకే చోట సర్వీసులో పనిచేయనీయరు. కాని సదరు డిఐజి ఏకంగా దశాబ్ధానికిపైగా ఒక చోట ఎలా తిష్టవేసుకొని కూర్చుంటున్నాడు. ఇదెలా సాధ్యమో శాఖ పెద్దలే వెల్లడిరచాలి. వారానికి రెండు సార్లు జోన్ పర్యటనలు సాగించి, కమీషనర్ కార్యాలయానికి వచ్చిన పిర్యాధులపై మళ్లీ ఉద్యోగులకు సమాచారం అందిస్తూ, అందిన కాడికి అందరూ కలిసి వాటాలు పంచుకుంటున్నారన్న అపవాదులు కూడా వున్నాయి. అందుకే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారు ఆడిరది ఆటపాడిరది పాటగా మారిందని జనం గగ్గొలు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ములుగు లాంటి సబ్ రిజిస్రేషన్ కార్యాలయం అంటేనే సామాన్యులు భయపడుతున్నారు.
ఇక మరో వ్యక్తి డోలి శ్రీకాంత్. వయసు 6ం సంవత్సరాలపై బడి వుంటాడు.
అతను కూడా ములుగు సబ్ రిజిస్ట్రార్ బాధితుడే. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, తనకు జరిగిన అన్యాయం గురించి కమీషన్ రెండుసార్లు విజ్ఞాపన పత్రాలిచ్చాడు. కాని పట్టించుకున్నవారేరీ? ఆయనకు న్యాయం చేసే వారేరి? ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే…రిజిస్ట్రేషన్‌కు తెచ్చే ప్రతి డ్యాక్యుమెంటుకు సదరు సబ్ రిజిస్ట్రార్ ముట్టజెప్సానంత ముట్ట జెప్పకపోవడమే? అంత ఇవ్వలేమని చెప్పడమే? డోలి శ్రీకాంత్. డాక్యుమెంటు రైటర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రతి డాక్యుమెంటుకు ప్రభుత్వ డ్యూటికి మించి, సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే గాని సంతకాలు పెట్టరు. రిజిస్ట్రేషన్ చేయరు. కాని కోరినంత ముట్టజెప్పితే ఎక్కడ సంతకమైనా పెడతారు? ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తారు? కాని అలా ముట్టజెప్పడం నా వల్ల కాదని చివరకు డాక్యుమెంటు రైటర్‌గా తన పనిని కూడా వదులుకున్నాడు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే ప్రతి పని గురించి బైటకు డోలి శ్రీకాంత్ మూలంగానే తెలుస్తుందన్న అనుమానంతో డోలిశ్రీకాంత్‌ను సబ్‌రిజిస్ట్రార్ ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. డోలి శ్రీకాంత్‌కు వారసత్వంగా సంక్రమించిన భూమిని, తన సోదరుడికి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు? ఇదీ డోలి శ్రీకాంత్ ఆందోళన. ఆవేదన. తన అన్న దగ్గర పెద్దఎత్తున సొమ్ము తీసుకోవడమే కాకుండా, తనను మానసికంగా, ఆర్ధికంగా వేధించాలని కక్ష్య కట్టి, తన భూమిని సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసిందన్న విషయాన్ని గత కమీషనర్‌కు పిర్యాధు చేసినా ఇంత వరకు న్యాయం జరగలేదు. జరుగుతుందన్న నమ్మకం కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషనర్ కార్యాయంలో ములుగు సబ్ రిజిస్ట్రార్‌కు ఎప్పటిప్పుడు ఉప్పందించే ఉద్యోగులు కూడా వుండడం విశేషం. పైగా పై స్ధాయిలో కూడా సబ్ రిజిస్ట్రార్‌కు అండదండలు పుష్కలంగా వుండడం వల్లనే ఇప్పటి వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయంటున్నాడు. అయితే కొత్త కమీషనర్ దృష్టికి ఈసారైనా దృష్టికి తీసుకెళ్లాలని మరోసారి తన ప్రయత్నం చేశాడు. అడిషినల్ కమీషనర్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు డోలి శ్రీకాంత్ వెల్లడిరచారు. అయితే డోలి శ్రీకాంత్ కు జరిగిన అన్యాయం పూర్తిగా చదివిన అడిషినల్ కమీషనర్ రాజేష్ మాత్రం తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పినట్లు చెప్పారు. వివరాలు తెలుసుకుంటానని చెప్పినట్లు డోలి శ్రీకాంత్ వెల్లడిరచారు. ములుగు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాయలం సాక్షిగా సాగుతున్న అక్రమాలపై పూర్తి స్ధాయి వివరాలు డోలి శ్రీకాంత్ అడిషినల్ కమీషనర్‌కు అందజేశాడు. ఆయన చెప్పిన వివరాలు వింటే నిజంగా విస్తుపోవాల్సిందే…సేవా ముసుగులో సాగుతున్న అక్రమ వ్యాపారం వింటే ఆశ్యర్యపోవాల్సిందే…ఆ వివరాలు…మరో సారి…మీ నేటిధాత్రిలో ఎక్స్‌క్లూజివ్‌గా….