చిల్పూర్ జనగామ నేటి ధాత్రి అధునాతన పద్ధతిలో డ్రోన్ సహకారంతో వ్యవసాయానికి మందు పిచికారి కార్యక్రమాన్ని మొదటిసారిగా పల్లగుట్ట గ్రామంలో అగ్రికప్టా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో నిర్వహించారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ బొట్టు చేరాలు వ్యవసాయ భూమిలో బుధవారం అగ్రికట్ట ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సహాకారంతో బొట్టు చీరాల కు ఉన్న ఆరా ఎకరం వ్యవసాయ భూమిలో వేసిన పంటకు డ్రోన్ ద్వారా వారికి పురుగుల మందులను ఎలా పిచికారి చేయాలని విధానాన్ని చూపిస్తూ పంటకు డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారి చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన కమిటీ డైరెక్టర్ కే సంపత్, కడియం యువసేన అధ్యక్షులు కన్నెబోయిన మల్లేష్ యాదవ్, రాజు, కుంచాల వెంకన్న తోపాటు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.