`పేదల వైద్యుడుగా కాళీ ప్రసాద్ రావుకు పేరు.
`పరకాలలో అభివృద్ధి శూన్యం!
`ఉద్యమకారుల వైద్యుడిని?
`ఉద్యమంలో దెబ్బలు తిన్న వేలాదిమందికి ఉచిత వైద్యం అందించా?
` తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు?
`తెలంగాణ లో అస్తవ్యస్త పాలన.
`వైద్య రంగం కుదేలు.
`జిల్లాకో మెడికల్ కాలేజీ మిధ్య.
`మౌళిక సదుపాయాల కల్పనే లేదు.
`వైద్యానికి వచ్చిన వారికి మందులే లెవ్వు?
`ఆసుపత్రులలో సిబ్బంది కరువు?
`ఎన్నికలలో ఈ విషయాలు ప్రజలకు వివరిస్తా?
`కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ గొప్ప దనం వివరిస్తా?
`దేశం అన్ని రంగాలలో ఎలా పరుగులు పెడుతుందో చెబుతా?
`దేశానికి ప్రధాని మోడీ నాయకత్వం అవసరాన్ని తెలిసేలా చేస్తా!
`తెలంగాణ లో బిజేపి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తా!
కాళీ ప్రసాద్ రావు. ఈ పేరు తెలియని వరంగల్ వాసి వుండరు. పేదల వైద్యుడుగా టక్కున గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమ కారులకు ఎంతో సుపరిచితమైన పేరు. ఆయనచే వైద్యం చేయించుకోని ఉద్యమ కారుడు వుండడు. అంత గొప్ప వైద్యుడు కాళీ ప్రసాద్. ఆయన పేదల వైద్యుడు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల వైద్యుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాదు, ఏ జిల్లా నుంచి వైద్యం కోసం ఆయన ఆసుపత్రికి వస్తే చాలు. తెలంగాణ ఉద్యమ కారుడు దెబ్బలతో వచ్చాడని తెలిస్తే చాలు, దగ్గరుండి వైద్యం చేసి తెలంగాణ తల్లి రుణం ఆ రూపంలో తీర్చుకున్న దేవుడు. ఉద్యమ సమయంలో ఉద్యమ కారులకు ఎంత పెద్ద వైద్యం అవసరమైనా సరే రూపాయి ఆశించకుండా వైద్య సేవలు అందించారు. అంత గొప్ప ఉద్యమ వైద్యుడు మరొకరు తెలంగాణ లోనే లేరు. హీ ఈస్ వన్ అండ్ ఓన్లీ కాళీ ప్రసాద్. వచ్చిన ప్రతి ఉద్యయకారుడికి కాదనకుండా, లేదనకుండా వైద్యం చేసిన ఏకైక వైద్యుడు ఆయన. ఎంతో మంది మీడియా ప్రతినిధులకు కూడా ఉచిత వైద్య సేవలు అందించిన సందర్భాలు అనేకం వున్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే మానుకోట సంఘటన ఒక గొప్ప ఘట్టం. ఆ రోజు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ఉద్యమ కారులు, మానుకోట రాళ్ల దెబ్బలతో గాయాల పాలై, రక్తాలు కారుతూ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందించారు. ఉద్యమ వైద్యుడుగా కీర్తి కెక్కారు. నాడు తెలంగాణ ఉద్యమానికి తన వంతు సహకారంగా ఆయన చేసిన సేవ అనన్యసామాన్యమైనది. అలాంటి కాళీ ప్రసాద్ ప్రత్యక్ష రాజకీయాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అటు వైద్య పరంగా ఎంతో మందికి సేవలందిస్తున్న కాళీ ప్రసాద్, విసృతమైన ప్రజాసేవ కోసం ప్రజల ముందుకు వస్తున్నారు. తాను పుట్టి పెరిగిన పరకాల అభివృద్ధి కోసం ఆరాటపడుతున్నాడు. తెలంగాణ వస్తే పరకాల ఎంతో అభివృద్ధి చెందుతుందనుకున్నాడు. వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో వున్నా పరకాల అభివృద్ధికి ఆమడ దూరంలోనే వుంది. నిజానికి పరకాల జిల్లా కావాల్సిన ప్రాంతం. కానీ ఇప్పటికీ వివక్షకు గురౌతూనే వుంది. తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా వెలుగులు చూడలేకపోతోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పరకాల పాత్ర అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా నిజాంను ఎదిరించి నిలిచిన గడ్డ పరకాల. అంటూ పరకాల పౌరుషం ఎలా వుంటుందో రానున్న ఎన్నికలలో చూపిస్తా అంటే కాళీ ప్రసాద్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…
పరకాలలో బిజేపి బలోపేతానికి కృషి చేస్తా! కాషాయజెండా ఎగరేస్తా!
ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరుతున్నా. తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ మంత్రి, బిజేపి తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తో వున్న సాన్నిహిత్యం బిజేపిలో చేరడానికి కారణమౌతోంది. నిజానికి నాకు ప్రజలకు సేవ చేయడం ఎంతో ఇష్టం. ప్రజలకు చేరువలో వుండడం ఇష్టం. ప్రజలకు అందుబాటులో వుండడం ఇష్టం. నా తెలంగాణ అంటే ఎంతో ఇష్టం. నా పరకాల అంటే ఎంతో మమకారం. తెలంగాణ వచ్చినా నా పరకాల ప్రగతికి మోక్షం రాకపోవడమే బాధాకరం. అందుకే నా పరకాలను తీర్చిదిద్దాలి. అద్భుతమైన ప్రగతికి పరకాలను ఆలవాలం చేయాలి. పరకాల యువత కు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రావాలి. పరకాల విద్యావంతులకు ఉద్యోగాలు రావాలి. పరకాల విద్యా పరంగా గొప్పగా వెలుగొందాలి. ప్రభుత్వ వైద్యం ఇంకా ఎంతో అందాలి. పరకాల ప్రజలకు మెరుగైన ఉచిత ప్రభుత్వ వైద్యం మరింత అందుబాటులోకి రావాలి. అన్ని రంగాలలో నా పరకాల అభివృద్ధిలో దూసుకుపోవాలి. ఇవన్నీ నెరవేరాలి. ఎవరో వస్తారని..ఏదో చేస్తారని ఎదురుచూడొద్దనుకుంటున్నాను. ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తున్నట్లే, పరకాల అభివృద్ధికి పాటుపడాలని ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నా. నా పరకాల ప్రగతిలో దూసుకుపోవాలి. నా కలే…పరకాల కల. ఆ కల నెరవేరితే చాలు నా ప్రాంతానికి తిరుగుండదు. జిల్లా కావడానికి అన్ని రకాల అర్హతలున్నా…కాలేదు. పరకాల జిల్లా కోసం కూడా పోరాటం చేస్తా..పరకాల జిల్లా సాధిస్తా..ఇదే నా ముందున్న కర్తవ్యంగా ముందుకు సాగుతా..అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వుంటా. అందరి సమస్యలు తెలుసుకొని ప్రగతి పరకాల నిర్మాణం చేస్తా.పేదల వైద్యుడుగా వున్న పేరును మరింత సార్థకత చేసుకుంటా. పేద ప్రజలకు అండగా వుంటా. వైద్యం తో పాటు వారి జీవితాలలో వెలుగులు నిండేందుకు కృషి చేస్తా.
పరకాలలో లేని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.
ప్రజలకు కనిపించాలి. అది ప్రజల ముందు ఆవిష్కరింపబడాలి. పరకాల మెయిన్ రోడ్డు మీద డివైర్లు, విద్యుత్ లైట్లే వెలుగులు చూసి మురిసిపోండి అన్నట్లుంది. పరకాలలో అభివృద్ధి శూన్యం. అభివృద్ధి ఆనవాలు కనిపించని బ్రహ్మపదార్థం చేశారు. మాటలెక్కువ..పనులు తక్కువ. చెబుతున్న అభివృద్ధి అంతా డొల్ల…విద్య మిద్య. వైద్యం సున్న. పైకి కనిపించేదంతా నిజం కాదు. ప్రభుత్వం చెప్పే లెక్కల్లో నిజాలు లేవు. అబద్దాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడే పైలా పచ్చీసు తప్ప బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయని గుండెల మీద చేయి వేసుకొని నిజం చెప్పే నాయకులు బిఆర్ఎస్ లో వున్నారా?
తెలంగాణ ప్రధాన ఆకాంక్షలైన నీళ్లు తేవాల్సిన చోట నిధులు నీళ్లలా ఖర్చు చేశారు. కాళేశ్వరం పేరుతో గోల్ మాల్ చేశారు. నేల విడిచి సాము చేశారు. రీ డిజైన్ పేరుతో నీళ్ల తేవాల్సిన చోట కోట్లు కుమ్మరించారు. వరద ద్వారా రావాల్సిన నీటిని ఎత్తిపోసి పంపుతున్నారు. అదే గొప్ప ఘనకార్యమని చెప్పుకుంటున్నారు. నిధులను నీళ్లలా ఖర్చు చేస్తూ, అవసరమైన అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. నియామకాలను గాలికొదిలేశారు. పదేళ్లైనా డిఎస్సీ లేదు. గ్రూప్ వన్ లీక్. ఇలా చెప్పుకుంటూ పోతే వంద వైఫల్యాలున్నాయి. తెలంగాణ లో అస్తవ్యస్త పాలన సాగుతోంది. ప్రజల చేత ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో వుండరు. నమ్మి రెండు సార్లు ప్రజలు గెలిపించినందుకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక వైద్యునిగా చెబుతున్నా వైద్య రంగం కుదేలైపోయింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు మిధ్య. మెడికల్ కాలేజీలలో వుండాల్సిన సౌకర్యాల కల్పన జరిగిందా? కొత్తగా ఉద్యోగాల నియామకాలు ఎన్ని జరిపారు. ఎంజిఎంలో వుండాల్సిన స్టాఫ్ ను మెడికల్ కాలేజీలకు పంపించిడం వైద్య రంగంలో విప్లవమా? మౌళిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైద్యం కోసం వచ్చిన వచ్చిన వారికి మందులే లెవ్వు? అన్నది వాస్తవం కాదా? అసలు ఆసుపత్రులలో అవసరమైన మేరకు సిబ్బంది వున్నారా? ప్రచారానికి, పైన పటారానికి బాగానే వుంది. ఆచరణే కరువైంది. అరచేతిలో వైకుంఠం చూపించడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటైంది. వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైగా వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించే చర్యలు చేపట్టారు. ఎన్నికలలో ఈ విషయాలు ప్రజలకు వివరిస్తా? ప్రజా ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టడం జరుగుతుంది. అసలైన నిజాలు ప్రజలకు వివరించడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యానికి చికిత్స చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలను మరుగన పడేస్తున్నారు. ఆ బకాయిలు కొన్నేళ్లుగా చెల్లించడం లేదు. దాంతో ఖరీదైన వైద్యం పేదలకు అందకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరాలని ఎంతో కాలం ఒత్తిడి వుండేది. మా ఆరోగ్య శ్రీ కన్నా మంచిదా? ఆయుష్మాన్ భారత్ అని ఎగతాళి చేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కీమ్ అమలు చేస్తోంది. పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏక కాలంలో ఐదు లక్షల వైద్యం ఉచితంగా అందజేసేందుకు తెచ్చిన ఆయుష్మాన్ భారత్ వల్ల దేశంలో వైద్య విప్లవం వచ్చింది. అదీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన గొప్పదనం. అవినీతికి అవకాశం , ఆస్కారం లేని స్వచ్చమైన పాలన అందిస్తున్న ప్రధాని మోడీ పాలనలో దేశం సుభిక్షంగా, సుసంపన్నంగా వుంది. ప్రపంచ దేశాలు మన దేశం గొప్పదనాన్ని కొనియాడుతయన్నాయి. ప్రపంచం ముందు భారత్ ను ఒక శక్తిగా తీర్చి దిద్ది చూపించిన నరేంద్ర మోడీ పాలన కేంద్రంలో మళ్ళీ మళ్ళీ కావాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా బిజేపి పరిపాలన రావాలని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని గర్వంగా చెబుతా? దేశానికి మోడీ ప్రధాని మోడీ నాయకత్వం అవసరాన్ని తెలిసేలా చేస్తా!
తెలంగాణ లో బిజేపి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తా! ఈటెల రాజేందర్ నాయకత్వం నేతృత్వంలో తెలంగాణ బిజేపి మరింత బలపడడమే కాదు, తెలంగాణ లో అధికారంలోకి వచ్చేందుకు జరిగే కృషి లో పాలుపంచుకుంటా! నా వంతు పూర్తి సహాకారం అందిస్తా! తెలంగాణ ఉద్యమానికి ఎలా తోడ్పాటునందించానో, బిజేపి అధికారంలోకి రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.