పద్మశాలి రాజకీయ యుద్ధభేరి కోరుట్ల బహిరంగ సభ విజయవంతం చేయాలి.

యుద్ధభేరి ఆహ్వాన కమిటీ ‌సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటి ధాత్రి
లగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 13న ఆదివారం నాడు కోరుట్లలో పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు విజయవంతం చేయాలని పద్మశాలి రాజకీయ యుద్ధభేరి ఆహ్వాన సభ్యులు లైసెడ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు, సిరిసిల్లలో పద్మశాలి సంఘ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత
పద్మశాలి లకు ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదని
రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల జనాభా ఉన్న పద్మశాలి లో
ఒకరు కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యేలు గాని లేకపోవడం చాలా అదృష్టకరమైన అన్నారు, రానున్న రోజుల్లో
పద్మశాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
119 నియోజకవర్గాల్లో ఒక్క పద్మశాలి ముద్దుబిడ్డ లేకపోవడం దురదృష్టకరమన్నారు, కావున కోరుట్ల సభను విజయవంతం చేయాలని పద్మశాలి నేతలకు మరియు పార్టీలకు అతీతంగా కోరుట్ల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి నేతలు సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ
జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు గోన ఎల్లప్ప
కొండ ప్రతాప్ పట్టణ ఉపాధ్యక్షుడు మోర రవి గాజుల బాలయ్య యువజన యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ మహిళా అధ్యక్షురాలు కామిని వనిత తదితరు పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!