ఈనెల 13న జరిగే కోరుట్ల సభ. టిఆర్పిఎస్ మండల అధ్యక్షులు బాసాని చంద్రప్రకాష్
శాయంపేట నేటి ధాత్రి; హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గల చేనేత సహకార సంఘం పద్మశాలి కులస్తులు సంఘటితంగా ఉండి, తమ హక్కులను సాధించుకోవాలని టిఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని చేనేత సొసైటీ ముందు బుధవారం పద్మశాలీల రాజ్యాధికార సాధన కోసం రాజకీయ పార్టీలకతీతంగా ఈనెల 13న కోరుట్లలో చేపడుతున్న పద్మశాలి రాజకీయ యుద్ధభేరిని జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను చంద్రప్రకాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి కులస్తులకు రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో మన వాటాసాధించుకోవాలంటే అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీల ఓటు బ్యాంకు శక్తిని ప్రదర్శించాలని, అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు రాజకీయ గుర్తింపు ఇవ్వడమే కాక సీట్లు, టికెట్లు కేటాయించాలని అన్నారు. ఈనెల 13న కోరుట్లలో జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధభేరికి పద్మశాలీలు కుటుంబ సభ్యులతో సహా హాజరై లక్షలాది మందితో మన సత్తా చాటాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అడ్హక్ కమిటీ అధ్యక్షులు వావిలాల వేణుగోపాల ప్రసాద్, స్థానిక సర్పంచ్ కందగట్ల రవి, సొసైటీ చైర్మన్ మామిడి శంకర్ లింగం, నాయకులు సామల మధుసూదన్, బాసాని లక్ష్మీనారాయణ, గుర్రం అశోక్, వంగరి సాంబయ్య, సామల మల్లయ్య, కందగట్ల ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి రాజకీయ యుద్ధభేరిని జయప్రదం చేయండి
