13న రాజకీయ యుద్ధ బేరి సభను విజయవంతం చేయండి….
తెలంగాణ పద్మశాలి సంఘం జనగాం జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత.
రఘునాథపల్లి జనగామ నేటి ధాత్రి:-
పద్మశాలిల ఐక్యతను చాటుదామని పద్మశాలి సంఘం జనగాం జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు కరిమికొండ వెంకటేశ్వర్లు నేత అన్నారు. బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో గల శ్రీ భక్త మార్కండేయ దేవాలయo లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందున్న పద్మశాలీలు రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నారని రానున్న రోజుల్లో ఐక్యతను చాటి రాజ్యాధికారం సాధించుకుందామని వారు తెలిపారు. రానున్న రోజుల్లో పద్మశాలీల ఐక్యత చాటేందుకు అన్ని రాజకీయ పార్టీల్లో అవకాశం ఉన్నచోట పోటీ చేయాలని వారు కోరారు. ఈనెల 13న జగిత్యాల జిల్లా కోరుట్లలో రాజకీయ పార్టీల కచ్చితంగా పద్మశాలి యుద్ధభేరి పేరిట సభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జనగామ జిల్లా వ్యాప్తంగా పద్మశాలీలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం బాధ్యులు చింతకింది బీక్షపతి నేత, గుండకృష్ణమూర్తి నేత, కరీంకోండ సిద్దయ్య నేత, గుండ మధుసూదన్ నేత, చింతకింది శ్రీహరి నేత, చిదురాల సోమ నరసయ్య నేత, అంబటి బాలరాజు నేత, చింతకింది యాదగిరి నేత, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.